Kuberaa Success Meet
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: ఇకపై నాగ్ దారిలోనే నేను.. ధనుష్‌కి బెస్ట్ యాక్టర్ రాకపోతే..!

Chiranjeevi: సూపర్ స్టార్ ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (King Nagarjuna), రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై, యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం మేకర్స్ బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సక్సెస్ మీట్ (Kuberaa Success Meet) లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇది నా సక్సెస్ మీట్‌లా అనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇక్కడ ఉన్నవాళ్లంతా నాకు కావలసిన వాళ్లు. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తోంది. ఇక్కడకి నేను గెస్ట్ గా రాలేదు. మీలో ఒకడిగా, ఆత్మీయుడుగా వచ్చాను. నాగార్జున ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశాడు. కుబేర గురించి అడిగాను. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను. నాకు ఎక్కడో డిఫరెంట్ గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది అలా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పారు. నేను సినిమా చూశాను. ఆయన చెప్పినది 100 శాతం కరెక్ట్. ఈ సినిమా తర్వాత తను మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం, అది నాగార్జున అంగీకరించడం ఇదే ఫస్ట్ సక్సెస్‌గా భావిస్తున్నాను.

Also Read- Manchu Family: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం.. అసలు విషయం ఇదే!

ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీస్తున్నాడు

దేవ క్యారెక్టర్‌లో ధనుష్‌ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్‌ని గుర్తించలేకపోయాను. అంతలా క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూశాను. వాస్తవంగా జరుగుతున్నట్టుగా అనిపించింది. ఒక్కొక్క సినిమాని ఆణిముత్యం లాగా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు శేఖర్ కమ్ముల. ‘స్టేట్ రౌడీ’ షూటింగ్ జరుగుతున్నప్పుడు శేఖర్ కమ్ముల నన్ను ఓ అభిమానిలా కలిశారు. ఆరోజే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలని పొందుతున్న దర్శకుడిగా ఆయన ఉండడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఆయనకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. శేఖర్ కమ్ముల సినిమాలో వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాల పాత్రలు కూడా దేవ, దీపక్ అనే గుర్తు పెట్టుకుంటాం. నాగ్ అనుకున్నట్లుగా ఇది ఆయనకి మరో డోర్ ఓపెన్ అయింది. మరిన్ని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఆయనకి వస్తాయి. ఆయన దారిలో నేను కూడా వస్తానని అనుకుంటున్నాను.

‘చూడాలని ఉంది‌’లో సౌందర్య గుర్తుకొచ్చింది

ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రష్మిక ఫెంటాస్టిక్‌గా పెర్ఫార్మ్ చేసింది. తన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను గెస్ట్‌గా వచ్చాను. తను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. తన క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో సమీరా క్యారెక్టర్ చూసినప్పుడు ‘చూడాలని ఉంది‌’లో సౌందర్య గుర్తుకొచ్చింది. ఈ సినిమా మొత్తంలో తన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది.

ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు

ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్‌కి ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు .అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్ గా క్యారెక్టర్ లో ఇమిడిపోయారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం.

Also Read- Peddi Update: హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్‌లో ‘పెద్ది’.. అదీ మ్యాటర్!

సునీల్ నాన్న నారాయణ దాస్ చాలా హానెస్ట్ పర్సన్. ఈ సినిమా బిజినెస్‌లో అంత నిజాయితీగా ఉండే వ్యక్తులు మరొకరు లేరు. ఆయన వారసులుగా సునీల్, థర్డ్ జనరేషన్‌లో జాన్వి ముందుకు వెళ్లడం అనేది చాలా ఆనందంగా ఉంది. జాన్వి‌తోనూ ఒక సినిమా చేస్తాను. ‘కుబేర’ వంటి మరెన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డిఓపి నికేత్ ఫెంటాస్టిక్ జాబ్. సినిమా చాలా రిచ్ గా ఉంది. ఇక్కడ యంగ్‌స్టర్స్‌ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి యంగ్‌స్టర్స్‌ రావాలి. ఇదే ఎనర్జీతో ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకుంటున్నాను.

దేవిశ్రీప్రసాద్ నా బిడ్డ లాంటివాడు. నా కం బ్యాక్ లో కూడా అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. తన ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది. దేశం మొత్తం తనని కీర్తిస్తోంది. సినిమా చాలా మ్యూజికల్ గా ఉంది. అలాగే దేవిశ్రీ రికార్డింగ్ లో అద్భుతం చేశాడు. ఇందులో తల్లి మీద పాడిన పాట ‘ఖైదీ నెంబర్ 150’ లో నీరు నీరు పాటని మైమరిపించే లాగా అనిపించింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సినిమాలు రావాలి. సినిమా సక్సెస్ గగనం అయిపోతున్న రోజులివి. థియేటర్స్ కి ఆడియన్స్ రప్పించడం గగనం అయిపోతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఇలాంటి కంటెంట్ వుంటే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారని భరోసా కల్పించిన సినిమా ఇది. ఈ క్రెడిట్ శేఖర్ కమ్ములకే చెందుతుంది. కంటెంట్ బాగుంటే హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేయగలిగితే.. ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారని కుబేర సినిమా నిరూపించింది. టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?