Kuberaa: కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (King Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కుబేర’ (Kuberaa). శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. విడుదలైన అన్ని చోట్ల యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్‌తో అద్భుతమైన బుకింగ్స్‌తో సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ శనివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.
Also Read- Venu Madhav: నడిచి వస్తున్న వేణుమాధవ్.. గుండెలు పిండేసే వీడియో వైరల్!
ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ టైమ్ యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ రివ్యూలు వచ్చాయి. ఎందులోనూ 3 రేటింగ్‌కి తక్కువ లేదు. అందరికీ యునానిమస్‌గా సినిమా నచ్చింది. నిర్మాతలు సునీల్, పుస్కుర్ రామ్ మోహన్ రావులకు థాంక్యూ. శేఖర్‌తో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను. సుమంత్, చైతన్య, అమల వీళ్లంతా పని చేయడానికి ముందే నాకు శేఖర్‌తో వర్క్ చేయాలని ఉండేది. శేఖర్ కూడా.. నేను కలిసిన ప్రతిసారి ‘మీతో ఒక స్టైలిష్, ఫ్యామిలీ సినిమా చేయాలని వుందని’ చెప్తుండేవారు. ఫైనల్‌గా మా కాంబినేషన్‌లో ‘కుబేర’ వచ్చింది. బ్యూటిఫుల్ క్యారెక్టర్ రాశారు. నాకు ఎప్పటినుంచో ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ఉండేది. శేఖర్ ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ చూశాను. ఆయన డిజైన్ చేసే పాత్రలకు అద్భుతంగా న్యాయం చేస్తారు. ‘కుబేర’ కథ వినగానే నాది మెయిన్ క్యారెక్టర్ అనిపించింది. ఇందులోని ప్రతి పాత్ర.. నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఈ కథ విన్నప్పుడే ఇది దీపక్ కథ అనిపించింది. శేఖర్ కమ్ముల కూడా దీన్ని అలానే చెప్పారు. దీపక్ పాత్రతో సినిమాలోని మిగతా క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ దీపక్ పాత్రకి త్రీ షేడ్స్ ఇచ్చారు. అందుకే ఈ పాత్ర నాకు బాగా నచ్చి, వెంటనే ఓకే చెప్పాను. నా పాత్రకి వచ్చిన రెస్పాన్స్ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ‘మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ’.. ఈ సినిమాలన్నింటిలో హీరో ఎవరనేది చెప్పలేం. అందులో కథే హీరో. అవన్నీ డైరెక్టర్ ఫిలిమ్స్. ‘కుబేర’ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ శేఖర్ కమ్ముల చిత్రం. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పోశారు. తర్వాత చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ’’ అని అన్నారు.
Also Read- Aamir Khan – Gauri Spratt: అమీర్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఇద్దరి ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!
సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా
డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా ఎమోషనల్‌గా ఉంది. ఈ సినిమా కథ పుట్టినప్పటి నుంచి చాలా డిఫరెంట్‌గా చేద్దాం, హాలీవుడ్ స్థాయిలో తీద్దాం, రియల్ లొకేషన్స్‌లో చేద్దాం, ముంబైని కొత్తగా చూపిద్దామని ఆశ పడ్డాం. నాగ్ సార్ దగ్గరికి అదే ఆశతో వెళ్ళాము. చాలా డిఫరెంట్‌గా చేద్దామని ఆయనకి కూడా చెప్పాను. ఆయనకి నచ్చింది. సినిమాలో అద్భుతంగా చేశారు. ఈ జర్నీలో మాకు ఆయన ఎంతో ధైర్యాన్ని నింపి ముందుకు నడిపించారు. అలాగే ధనుష్ కూడా. ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీ రీలీజ్ ఈవెంట్లో చెప్పాను. అది నిజమైంది. నేను చేసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిల్మ్. ఇందులో చాలా లేయర్స్ చెప్పడానికి ప్రయత్నించాను. ఇంత కొత్తగా, జెన్యూన్‌గా సినిమాని చెప్పే క్రమంలో కాస్త లెంత్ ఉండవచ్చు. ఈ సినిమాని మరోసారి చూసినప్పుడు మీకు తెలియని లేయర్స్ కూడా ఇందులో కొత్తగా కనిపిస్తాయి. సినిమా నిడివి తగ్గించాలని డైరెక్టర్‌కి, టీమ్‌కు తెలియని విషయం కాదు. కానీ ఇది చెప్పాల్సిన విషయం. కచ్చితంగా ఇలాగే చెప్పి తీరాలి. ఒక పాయింట్‌ని నిజాయితీగా చెప్పడమే దర్శకుడిగా నా ధర్మం. ఇప్పుడు ప్రేక్షకులు ఇచ్చిన యునానిమిస్ రిపోర్ట్‌తో చాలా ప్రౌడ్‌గా ఉంది. ఈ స్థాయి ప్రేక్షకులు ఇచ్చిందే. ఈ సినిమాకి గొప్ప స్థాయి ఇచ్చిన మీడియాకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాగార్జున, ధనుష్, రష్మికల పర్ఫార్మెన్స్‌కి థియేటర్స్‌లో వస్తున్న రెస్పాన్స్ చూశాను. చాలా మంచి టేకింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్.. ఇలా అన్నిటి గురించి ప్రేక్షకులు మాట్లాడుతుంటే చాలా గర్వంగా, ఆనందంగా అనిపిస్తోంది. ఇది ఒక కంప్లీట్ ఫిల్మ్’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు