Venu Madhav AI Image
ఎంటర్‌టైన్మెంట్

Venu Madhav: నడిచి వస్తున్న వేణుమాధవ్.. గుండెలు పిండేసే వీడియో వైరల్!

Venu Madhav: కమెడియన్ వేణు మాధవ్.. ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ, కాస్త వెనక్కి వెళితే మాత్రం.. ఆయనలేని సినిమా ఉండేది కాదు. అప్పటి స్టార్ హీరోలందరి సినిమాలలో నటించి, తనదైన మార్క్ కామెడీతో అందరినీ అలరించారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌‌గా ప్రయాణం మొదలెట్టిన వేణు మాధవ్ పుట్టింది సూర్యా పేట జిల్లా కోదాడలో. వెంట్రిలాక్విజంలో ఆరితేరిన వేణు మాధవ్ పలువురిని అనుకరిస్తూ.. నందమూరి తారక రామారావు కన్నుల్లో పడ్డారు. టీడీపీ ఆఫీస్‌లో పని చేస్తూనే.. ఖాళీ సమయంలో ప్రోగ్రామ్స్ చేస్తుండేవారు. అలా ఓసారి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేస్తుండగా.. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి చూశారు. వెంటనే ఆయనను పిలిపించి ‘సంప్రదాయం’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత వేణు మాధవ్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాలతో బిజీ నటుడిగా మారిపోయారు.

Also Read- Kuberaa OTT: ‘కుబేర’ ఓటీటీ డీల్ ఎంతో తెలుసా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

కమెడియన్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అనంతరం హీరోగానూ వేణు మాధవ్ సినిమాలు చేశారు. ‘హంగామా’, ‘భూకైలాష్, ప్రేమాభిషేకం’ వంటి చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు. ‘దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి’ వంటి సినిమాల్లో వేణు మాధవ్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు 20 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకున్న వేణు మాధవ్.. రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ ఆ కోరిక తీరకుండానే కాలేయ సంబంధిత వ్యాధితో 2019లో మృతి చెందారు. మరణం అనంతరం ఇండస్ట్రీలో వేణు మాధవ్ ప్లేస్‌ని రీప్లేస్ చేసే కమెడియన్ రాలేదంటే.. ఎంతగా ప్రేక్షకులని ఆయన అలరించాడో అర్థం చేసుకోవచ్చు. మరి ఎప్పుడో చనిపోయిన వ్యక్తి గురించి ఇప్పుడెందుకు? అని అంతా అనుకుంటున్నారు కదా! అసలు విషయంలోకి వస్తే..

Also Read- Special Railway Stations: దేశంలో టాప్-7 రైల్వే స్టేషన్లు.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!

ఈ మధ్యకాలంలో AI టెక్నాలజీ ఎంతగా ప్రజలను ప్రభావితం చేస్తుందో తెలియంది కాదు. టెక్నాలజీ వల్ల కొంత నష్టం ఉండొచ్చు కానీ, దానిని సక్రమంగా వాడితే ఎంతో మేలు జరుగుతుందని అంతా చెబుతూనే ఉన్నారు. ఈ AI టెక్నాలజీలో డీప్ ఫేక్ వీడియోలు ఎలా అయితే వైరల్ అయ్యాయో.. ఎప్పుడో చనిపోయిన వారు మళ్లీ బతికొచ్చినట్లుగా చూపించే వీడియోలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి. డీప్ ఫేక్ విషయంలో ఈ టెక్నాలజీని తిట్టుకున్న వారు.. మళ్లీ ప్రాణం పోస్తున్న వీడియోలతో AIని మెచ్చుకుంటున్నారు. చనిపోయిన వారినే కాదు.. వారితో పాటు ఉన్న ఎమోషన్స్‌ని కూడా ఈ వీడియోలు బతికిస్తున్నాయి. అందుకు ఉదాహరణే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేణు మాధవ్ వీడియో. ఈ వీడియోను కనుక.. ఆయన కుటుంబ సభ్యులు చూస్తే.. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కష్టమే. అంత గొప్పగా ఈ వీడియోని క్రియేట్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే.. నిజంగానే వేణు మాధవ్ ఇంకా బతికే ఉన్నాడనే ఫీల్ వస్తుంది. ఈ వీడియోకు నెటిజన్లు కూడా ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తుండటం విశేషం.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు