Sathi Leelavathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని పెళ్లాడిన తర్వాత కూడా లావణ్య త్రిపాఠి.. కొన్ని సెలక్టెడ్ సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల వరుణ్ తేజ్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి చేసిన రెండు మూడు సినిమాలలో ఇప్పుడో సినిమా విడుదలకు సిద్ధమైంది. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), మలయాళ నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)’ ఫేమ్ తాతినేని సత్య (Tatineni Satya) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని (Sathi Leelavathi First Look) మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Samantha: చైతూతో కలిసి ప్రమోషన్స్.. సమంత షాకింగ్ రియాక్షన్!
ఈ ఫస్ట్ లుక్‌లో హీరో దేవ్ మోహన్‌ను బేషిన్‌కి కట్టేసి బిగ్గరగా మైక్‌లో అరుస్తోంది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. వారిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నట్లుగా అర్థమవుతోంది. లేదంటే, తను ఎంత చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న దేవ్‌కు ఆమె బుద్ది చెబుతున్నట్లుగా ఉంది. ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్రయత్నమే ఈ ‘సతీ లీలావతి’ చిత్రమని అంటున్నారు మేకర్స్. ఈ మూవీ కాన్సెఫ్ట్ ఏమిటంటే..
ప్రస్తుతం సమాజంలో కుటుంబ వ్యవస్థ రోజురోజుకు ఎంతగా బలహీన పడుతుందో తెలియంది కాదు. అందుకు కారణం మనుషుల మధ్య ఎమోషన్స్, ఫీలింగ్స్ లేకపోవటమే. భావోద్వేగాలే బంధాలను కలకాలం నిలుపుతాయి. రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య ఎమోషన్స్ ఎంత బలంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సునిశితమైన అంశాన్ని హృద్యంగా చెప్పబోతున్నారు దర్శకుడు తాతినేని సత్య. ఈ సినిమా ప్రస్తుత జనరేషన్‌కు ఒక పాఠంగా ఉండబోతుందని ఆయన అంటున్నారు.
Also Read- Special Railway Stations: దేశంలో టాప్-7 రైల్వే స్టేషన్లు.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!
‘సతీ లీలావతి’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్నట్లుగా చిత్ర నిర్మాత నాగ మోహన్ తెలిపారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని, అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమాను శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు