Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)కు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. ఆయనకు హిట్ పడి చాలా కాలం అవుతుంది. అయినా సరే, ప్రయోగాలు చేయడంలో సూర్య మాత్రం అస్సలు తగ్గడం లేదు. మొదటి నుంచి వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సూర్య.. ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ కమెడియన్ దర్శకత్వంలో ఆయన నటించడానికి ఓకే చెప్పారు. సూర్య తన మాగ్నమోపస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం (Suriya45) కోసం దర్శకుడు, కమెడియన్ ఆర్జే బాలాజీ (RJ Balaji)తో చేతులు కలిపారు. తమిళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి, మంచి పేరును సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్‌తో ఖరారు చేస్తూ.. మేకర్స్ టైటిల్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.
Also Read- Nagarjuna: కింగ్ నాగార్జునకు, అలేఖ్య చిట్టి పికిల్స్‌కు ఉన్న లింకేంటి? వీడియో వైరల్!
సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి ‘కరుప్పు’ అని టైటిల్‌ని ఫైనల్ చేశారు. దర్శకుడు ఆర్జే బాలాజీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్ర టైటిల్ లుక్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ పవర్ ఫుల్‌గా ఉంది. సూర్య చేతిలో కత్తి పట్టుకుని, అతని వెనుక ఒక దేవత ఉన్నట్లుగా ఫెరోషియష్ అవతార్‌లో కనిపించారు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో వచ్చిన ‘మర్మదేశం’ సీరియల్‌లోని వీరభద్ర స్వామిని తలపిస్తోంది. ఈ సినిమా యాక్షన్‌తో నిండి ఉంటుందని, సూర్య వైల్డ్ పాత్రలో కనిపిస్తాడనేది ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఎప్పుడూ కార్తీతో సినిమాలు చేసే డ్రీమ్ వారియర్ పిక్చర్స్.. సూర్యతో చేయబోతున్న ‘కరుప్పు’ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘ముక్కుత్తి అమ్మన్’ చిత్రంతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు ఆర్జే బాలాజీ. స్టార్ కాస్ట్ పరంగా ‘కరుప్పు’తో ఈ కమెడియన్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తున్నారు.
Also Read- Kuberaa Review: ధనుష్, నాగ్, రష్మికల ‘కుబేర’ ఎలా ఉందంటే..
సూర్య వంటి నటుడు ఆర్జే బాలాజీకి ఛాన్స్ ఇచ్చాడంటే కచ్చితంగా ఇందులో పెద్ద మ్యాటరే ఉండి ఉంటుంది. అయితే ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్పడం కష్టం. పెద్ద పెద్ద దర్శకులని నమ్ముకుని చేసిన సూర్య చిత్రాలన్నీ ఈ మధ్య బోల్తా కొడుతున్నాయి. కచ్చితంగా ఆర్జే బాలాజీ మంచి హిట్ ఇస్తాడని సూర్య ఫ్యాన్స్ నమ్ముతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సూర్య, త్రిష ఈ చిత్రంలో జోడిగా నటిస్తున్నారు. ఇద్దరూ ఇందులో భిన్నమైన మేకోవర్‌లో కనిపిస్తారని టీమ్ చెబుతోంది. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వాసిక, అనఘ, మాయ రవి, శివద, సుప్రీత్ రెడ్డి వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్య టాక్ ఆఫ్ ద కోలీవుడ్‌గా మారిన యువ సంగీత సంచలనం సాయి అభ్యాంకర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. చిన్న ప్యాచ్‌వర్క్ మినహా షూట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ఈ సందర్భంగా తెలిసింది. అదే సమయంలో టీం పోస్ట్-ప్రొడక్షన్‌పై కూడా పని చేస్తోంది. త్వరలోనే మేకర్స్ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు