Nagarjuna: టైటిల్ చూసి అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) వెనుక కింగ్ నాగార్జున (King Nagarjuna) హస్తం ఏమైనా ఉందా? అని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు. కాకపోతే కింగ్ నాగార్జునకు, అలేఖ్య చిట్టి పికిల్స్‌కు మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగినట్లుగా ఓ వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. కింగ్ నాగార్జున ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కుబేర’. ఈ సినిమా జూన్ 20 థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందు.. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కింగ్ నాగార్జునను, చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ములను నాగ చైతన్య (Naga Chaitanya) స్పెషల్‌గా ఓ ఇంటర్వ్యూ చేశారు. అంతకు ముందు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో చైతూ, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా ‘లవ్ స్టోరి’ (Love Story) అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో చైతూ అడిగిన ఓ ప్రశ్నకు కింగ్ నాగ్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. అయితే ఆయన ఎక్కడా అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రస్తావన తీసుకురాలేదు కానీ, ఆ వీడియోలో కింగ్ నాగ్ చెప్పింది మాత్రం వారి గురించే అని నెటిజన్లు కొందరు మీమ్స్ చేసి సోషల్ మీడియాలో అల్లరల్లరి చేస్తున్నారు.
Also Read- Kuberaa Review: ధనుష్, నాగ్, రష్మికల ‘కుబేర’ ఎలా ఉందంటే..
అసలింతకీ చైతూ ఏం అడిగారంటే.. మీరు రీసెంట్‌గా రిగ్రెట్‌గా ఫీలైన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని కింగ్‌ని చైతూ అడిగారు. దీనికి నాగార్జున సమాధానిమిస్తూ.. ‘‘ఈ మధ్య అలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రమ్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఒక ఇన్సిడెంట్. అది చూడడానికి చాలా బాగుంటుంది. కానీ అది ఇంటికి వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోతుంది. (మధ్యలో చైతూ కలగజేసుకుని, మనకు చూపించింది పంపరు.. వేరే ఏదో పంపిస్తారని అన్నారు). నాకు అది తినాలనిపిస్తుందని మన అసిస్టెంట్ శ్రీనుకు చెప్పి తెప్పించాను. తనతో పాటూ నేను కూడా ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఫీల్ అవుతూ తినాలని ఓపెన్ చేస్తే.. వాళ్ళు ఇన్‌స్టాలో చూపించిన దానికి, వారి పంపించినదానికి అసలు సంబంధమే లేదు’’ అని కింగ్ నాగ్ చెప్పుకొచ్చారు.
Also Read- Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లిపై ఆసక్తికర విషయం బయటపెట్టిన వెడ్డింగ్ డిజైనర్
నాగ్ చెబుతున్న ఈ వీడియో కింద అలేఖ్య చిట్టి పికిల్స్ పాపల ఫొటోలను పెట్టి.. కొందరు మీమ్స్ రాయుళ్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంతగా వైరల్ అయింది ఎవరయ్యా? అంటే కచ్చితంగా ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ పేరే వినబడుతుంది. వారి మ్యాటర్ మాములుగా వైరల్ అవలేదు. వారు మాట్లాడే భాష, వారు అమ్మే పచ్చళ్ల ధర.. ఇలా అన్నీ కలగలిపి పెద్ద దుమారమే చెలరేగింది. అందరూ వాళ్లని విమర్శించిన వారే. ఈ వివాదంతో వారు తీసుకున్న నిర్ణయాలు వగైరా వగైరా అన్నీ కలగలిపి ఓ నెల రోజుల పాటు సోషల్ మీడియా అంతా వాళ్లే కనిపించారు. వారు చెప్పిన మాటలు విని, కింగ్ నాగార్జున కూడా ఆ పచ్చళ్లు తెప్పించుకుని మోసపోయారని.. ఈ వీడియోకి సదరు నెటిజన్లు కథలు అల్లేస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం ఎక్కడా పికిల్స్ పాపల పేర్లు ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ.. నెటిజన్లకు పని కల్పిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు