Bhatti Vikramarka(imagcredit:twitter)
తెలంగాణ

Bhatti Vikramarka: అభివృద్ధికి కొత్త నిర్వచనం తెలంగాణ.. డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka: అభివృద్ధికి కొత్త నిర్వచనం తెలంగాణ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. సామాజిక న్యాయం పునాదిపై ఆర్ధిక అభివృద్ధి కొనసాగుతుందన్నారు. పెట్టుబడులకు సరైన వేదిక (Investment Hub) హైదరాబాద్ అంటూ ఆయన వివరించారు. ఆర్థిక అభివృద్ధి తో పాటు మానవీయ కోణాన్ని జోడిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఓ కొత్త నిర్వచనాన్ని రచిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన హైదరాబాదులో జరిగిన అసోచామ్ సదరన్ కౌన్సిల్ సదస్సు, అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

బాధ్యతలతో కూడిన తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక, పర్యావరణ బాధ్యత లతో కూడిన తెలంగాణను నిర్మించేందుకు యావత్ క్యాబినెట్ కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఇప్పుడు అపార వనరులు ఉన్నా కానీ అసమానతలు ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలు నిధులు ఖర్చు చేసేందుకు తెలంగాణ రాష్ట్రం సరైన వేదిక అన్నారు. ఈ రాష్ట్రంలో అనుకున్న లక్ష్యాలను నూటికి నూరు శాతం నెరవేర్చడంతో పాటు ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేసేందుకు అవకాశం ఉన్నదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సీఎస్ ఆర్ నిధులు ఖర్చు చేయాలని పిలుపునిచ్చారు.

Also Read: Gajarla Ravi: వీడిన 33 ఏళ్ల అజ్ఞాతం.. కన్నీరు మున్నీరవుతున్న గాజర్ల రవి కుటుంబం

ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India International Residential Schools) నిర్మిస్తున్నామన్నారు. ఒక్కో పాఠశాలను 25 ఎకరాల క్యాంపస్లో, ఒక్కో పాఠశాలను రూ. 200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామన్నారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున 100 పాఠశాలలు మంజూరు చేస్తామన్నారు. గతంలో నిర్మించిన 100 ఐటీఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Also Read: Street Lights: స్ట్రీట్ లైట్ల సమస్యలు పరిష్కరించాలి కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశం

 

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు