Maoists Killed( image credit: twitter)
తెలంగాణ

Maoists Killed: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో.. మరో ఎన్కౌంటర్!

Maoists Killed: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని కాంకేర జిల్లాలో (Kankera District) భద్రత బలగాలకు మావోయిస్టులకు బీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, మరికొందరికి గాయాలైనట్లు (Kankera) కాంకేర ఎస్పి ఇందిరా కళ్యాణ్ (Indira Kalyan) ఎలిషల వెల్లడించారు. ఉదయం నుంచి రాష్ట్రంలోని కాంకేర జిల్లా  (Kankera District) చోటే బెట్టియ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, (Maoists) భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 Also Read:Hyderabad ORR Kondapur : ఔటర్ నుంచి కొండాపూర్ వైపు.. ఇక అడ్డంకుల్లేని ప్రయాణం! 

బీకర దాడులు

అయితే ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టిన నాటి నుంచి మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. చాప కింద నీరులా కేంద్ర భద్రతా బలగాలు, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్ర పోలీసులు (police) ముకుమ్మడిగా మావోయిస్టులపై విరుచుకుపడుతున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తూ మావోయిస్టులను మట్టు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే కర్రే గుట్టల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ల నుంచి ఇప్పటివరకు దాదాపు 50 మందికి పైగానే మావోయిస్టు లోని కీలక నేతలు మృత్యువాత చెందారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, (Amit Shah) దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మావోయిస్టులపై ఉక్కు పాదం మోపేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఈ మేరకు అనుకున్న విధంగానే మావోయిస్టులపై బీకర దాడులు చేస్తూ వారిని మట్టు పెడుతూ వస్తున్నారు.

మావోయిస్టులను లేకుండా చేయడమే ధ్యేయం

ఇటీవల కాలంలో కర్రెగుట్టల ప్రాంతాన్ని వదిలి వచ్చిన మావోయిస్టులను (Maoists) భద్రత బలగాలు మాత్రం వదిలిపెట్టడం లేదు. దొరికిన వాళ్లందర్నీ పోలీసులు మట్టు పెడుతూ వస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు 2026, మార్చి 31 వరకు అనుకున్న విధంగానే మావోయిస్టులు లేని దేశంగా ఇండియాను తీర్చిదిద్దే విధంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) అడుగులు వేస్తోంది.  (Central Government) కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగానే మావోయిస్టులను లేకుండా చేయడమే ధ్యేయంగా భద్రత బలగాలు పనిచేస్తున్నాయి.

 Also Read: Child Protection Wing: చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో.. 15 మంది అరెస్ట్!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?