Deputy CM Bhatti Vikramarka(image credit: swetcha reporter)
తెలంగాణ

Deputy CM Bhatti Vikramarka: సింగరేణి బలోపేతమే లక్ష్యం.. డిప్యూటీ సీఎం కీలక వాఖ్యలు!

Deputy CM Bhatti Vikramarka: సింగరేణి (Singareni) సంస్థ బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.  కెటికె–2 మైన్‌ను పరిశీలించిన అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మారిన మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి ఎదగాలని, బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని సూచించారు. సింగరేణి (Singareni) లాభాల్లో ఉండి సంస్థ ఉద్యోగులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన ఆలోచన అని డిప్యూటీ సీఎం (Deputy CM) తెలిపారు.

గతంలో బొగ్గు రంగంలో సింగరేణి, (Singareni) కోల్ ఇండియాలదే ఏకచత్రాధిపత్యం అయినప్పటికీ, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా బొగ్గు రంగంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో మార్కెట్‌లో పోటీని తట్టుకొని సింగరేణి (Singareni)  నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ కంపెనీల బొగ్గు ఉత్పత్తి వ్యయం, బహిరంగ మార్కెట్‌లో వాటి విక్రయ ధరలు, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం, బహిరంగ మార్కెట్‌లో సింగరేణి బొగ్గుకు ఉన్న ధరను ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది పోల్చుకోవాలని డిప్యూటీ సీఎం (Deputy CM) సూచించారు.

 Also Read: Minister Ponnam Prabhakar: గోల్కొండ బోనాలకు.. పకడ్బందీ ఏర్పాట్లు!

కన్సల్టెంట్స్‌ను నియమించుకోవాలి

ఈ వివరాలను సింగరేణి (Singareni)  కార్మికులకు అవగాహన కలిగేలా మైన్స్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, కార్మికులు, అధికారులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. 136 సంవత్సరాల అనుభవం ఉన్న సింగరేణి బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టి లాభాలు ఆర్జించే ఆలోచన చేయాలన్నారు. ప్రపంచంలో ఉన్న క్రిటికల్ మినరల్స్ ఏమిటి, వాటికి ఉన్న డిమాండ్ ఎంత అన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్స్‌ను నియమించుకోవాలని సూచించారు. భవిష్యత్తు గురించి ఆలోచన చేయకపోతే ముందు తరాలకు నష్టం చేసినట్టు అవుతుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. సింగరేణిలో పూర్తిగా వ్యాపారమే కాకుండా మానవీయ కోణం కూడా ఉండాలని తెలిపారు. సింగరేణి మైన్ కార్యకలాపాలు జరిగే ప్రాంతం మొత్తం అక్కడి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆదేశించారు.

ప్రమాద బీమా సౌకర్యం

భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ అంశంపై విచారణ చేయాలని, (Singareni)  సింగరేణి మైన్స్ కోసం భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు (Employees) ఇవ్వాల్సిన జాబితాపై విచారించి, అర్హుల జాబితా పంపాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఇటీవల కల్పించామని, సింగరేణిలోని శాశ్వత (Employees) ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తున్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, (Sridar Babu)  ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, , (Singareni) సింగరేణి సీఎండీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సింగరేణి డైరెక్టర్ పీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

 Also ReadRanga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!

అధికారుల పాత్ర కీలకం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, (Sridar Babu)  అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం అని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

బియ్యం పంపిణీలో క్వాలిటీ, క్వాంటిటీ ఉండాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన నిరుపేదలకు చెందాలని, పూర్తిస్థాయిలో అధికారులు విచారణ జరిపి అనర్హులను గుర్తించి తొలగించాలని అన్నారు. తొందరపడి తప్పులు చేయొద్దని, రేషన్ కార్డుల జారీ చేసేందుకు విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సన్న బియ్యం పంపిణీలో క్వాలిటీ, క్వాంటిటీ ఉండాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా 6ఏ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతూ.. మంత్రి, ఎమ్మెల్యేలు చెప్పినా పైరవీలకు అవకాశం లేకుండా నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని తెలిపారు. ఎలాంటి దరఖాస్తులు ప్రజల నుంచి వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న చౌక దుకాణాలను భర్తీ చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకంలో పాడి గేదెల యూనిట్లు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్‌డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 Also Read: Sandhya Convention Land Dispute: సంధ్య శ్రీధర్‌కు బిగ్ షాక్.. ఎఫ్‌సీఐ లేఔట్‌ పునరుద్ధరణ!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు