Mega157: చిరు సినిమా సెట్స్‌లోకి ఎంటరైన లేడీ సూపర్ స్టార్.. ఇక దూకుడే!
Chiru and Anil Ravipudi
ఎంటర్‌టైన్‌మెంట్

Mega157: చిరు సినిమా సెట్స్‌లోకి ఎంటరైన లేడీ సూపర్ స్టార్.. ఇక దూకుడే!

Mega157: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘Mega157’. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముస్సోరీలో జరుగుతున్నట్లుగా రీసెంట్‌గా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో అదిరే అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం.. ఇంత సడన్‌గా ఎందుకిలా?

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా నయనతార (Nayanthara) నటిస్తున్నట్లుగా మేకర్స్ ఓ వీడియో ప్రకటన ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్ర షూటింగ్‌లోకి మంగళవారం నయనతార జాయిన్ అయినట్లుగా మేకర్స్ తెలిపారు. కథ పరంగా, తన పాత్రపై ఎంతో ఆనందంగా వున్న నయనతార, ఎప్పుడూ లేని విధంగా ఈసారి సినిమా ప్రమోషన్లలో సైతం చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు ఉదాహరణ ఈ సినిమాలో ఆమె నటిస్తున్నట్లుగా చెబుతూ ఓ ప్రత్యేక ప్రమోషనల్ వీడియోను విడుదల చేయడమే. ఆ వీడియో అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. సినిమాకు సంబంధించి రాబోయే ప్రచార కార్యక్రమాల్లో సైతం నయనతార పార్టిసిపేట్ చేయడానికి ఓకే చెప్పినట్లుగా యూనిట్ తెలుపుతుంది.

Also Read- Oh Bhama Ayyo Rama: సుహాస్ బ్యూటీఫుల్ రొమాంటిక్ ఫిల్మ్.. రిలీజ్ డేట్ ఫిక్సయింది

అనిల్ రావిపూడి సినిమాలంటే ఆ మాత్రం ఉంటది మరి. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్‌ని ఆయన ఎలా నిర్వహించారో ప్రత్యక్షంగా అంతా చూశారు. మరి అలాంటి దర్శకుడి సినిమా అంటే నయనతారే కాదు.. ఇంకెవరైనా సరే ఓకే అనకుండా ఉంటారా? అందులోనూ మెగాస్టార్ చిరంజీవి సినిమా. అందుకే నయనతార ఈసారి పూర్తి సహకారం అందించాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. కమర్షియల్ ఫార్మాట్లలో హిలేరియస్ ఎంటర్ టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో అనిల్ రావిపూడి దిట్ట. అలాగే ప్రమోషనల్ కంటెంట్‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ వీడియో ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకుని, ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునేలా చేశాయి.

Nayanthara joins Mega 157 Sets

ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్‌గా, ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. వీరందరినీ పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య