Oh Bhama Ayyo Rama: సినిమా సినిమాకు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. హీరోగా దూసుకెళుతోన్నాడు సుహాస్ (Suhas). ప్రస్తుతం ఆయన నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో ‘జో’ అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (Malavika Manoj) ఈ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వంలో వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్, పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని తెలుపుతూ మేకర్స్ ఓ న్యూ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమా జూలై 11న (Oh Bhama Ayyo Rama Release Date) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
Also Read- Samantha: సమంతకు చేదు అనుభవం.. వద్దన్నా, అలా వెంటపడుతున్నారేంటి?
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోధల మాట్లాడుతూ.. ఇదొక బ్యూటీఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ అందరినీ ఎంతగానో అలరిస్తుంది. ఇదొక క్యూట్ అండ్ ఎంటర్‌టైనింగ్ లవ్‌స్టోరీ. ఈ సినిమాలోని ప్రతి ఫేమ్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సుహాస్ ఇంతకు చేయని పాత్రలో ఇందులో కనిపిస్తారు. ఆయన ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. రామ్‌గా సుహాస్, సత్యభామగా మాళవిక మనోజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతి కుటుంబానికి రిలేటెడ్‌గా ఉంటూ ఎంతో వినోదాన్ని పంచుతాయి. ఖర్చు విషయంలో మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించార. ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలిపారు.
Also Read- PC Meena Reporting: ‘రెక్కీ’ తర్వాత సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో.. డోంట్ మిస్!
నిర్మాత హరీష్ నల్ల మాట్లాడుతూ.. సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాం. ఇప్పుడలాంటి సినిమాతోనే మా బ్యానర్‌లో సినిమాను రూపొందించాం. అందరినీ నవ్విస్తూ, ఎంటర్‌టైన్ చేసే యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ‘ఓ భామ అయ్యో రామ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. తప్పకుండా ఈ చిత్రం సుహాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. జూలై 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కచ్చితంగా థియేటర్‌లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అనిత హసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాత్విక్ ఆనంద్, నయని పావని వంటి వారు ఇతర పాత్రలలో నటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు