Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది. సినిమాలో ఈమె పాత్ర కొంచమైనా ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఎన్టీఆర్ పక్కన నటించడంతో మన తెలుగు వారికి బాగా దగ్గరైంది. ప్రస్తుతం, రామ్ చరణ్ తో ఓ సినిమాలో నటిస్తుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరక్షన్లో వస్తున్న పెద్ది మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మే నటిస్తుంది. తాజాగా, జాన్వీ కపూర్ పెళ్లి గురించి ప్రముఖ జ్యోతిష్యుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్నడూ లేనిది ఈమె పెళ్లి పై ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతిష్యుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవలే జ్యోతిష్యులు ప్రముఖుల జీవితంలో జరగబోయే విషయాలను ముందుగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ గురించి కూడా ఓ జ్యోతిష్యుడు నమ్మలేని నిజాలను బయట పెట్టాడు. ఇది విని ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
తాజాగా బాలీవుడ్ లో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ జ్యోతిష్యుడు జాన్వీ జాతకం గురించి మాట్లాడుతూ.. ఆమెకి ఈ ఏడాదిలోనే పెళ్లి జరగాలి. జాన్వీ కపూర్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటే ఆమె జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని అన్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకోకపోతే 33 ఏళ్లు దాటాక వచ్చాక పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.