CM Revanth Reddy: క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలి!
CM Revanth Reddy( image credit: twitter)
Telangana News

CM Revanth Reddy: నాయకులు క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలి!

CM Revanth Reddy:  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలని, క్యాడర్‌తోనూ ప్రచారం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంత్రులకు సూచించారు. ( Hyderabad) హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై, ప్రభుత్వ పథకాలపై, (Welfare Schemes) విద్యావైద్యరంగాలు, రైతు భరోసా, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం (CM) మాట్లాడుతూ, మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు (Ministers) సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కోఆర్డినేషన్ లేకుంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకం ప్రజల్లోకి వెళ్లదని, అర్హులకు అందజేయాలేమన్నారు.

 Also Read: Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులుండవు.. కిషన్ రెడ్డి

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో ఎన్నికలు కంప్లీట్ చేసుకుందామని పేర్కొన్నట్లు తెలిసింది. క్యాడర్‌కు నిత్యం అందుబాటులో ఉండాలని వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రులకు సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ఖరాఖండీగా చెప్పారు. మెజార్టీ సీట్లతో విజయం సాధించాలని, అందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రులకు సూచించారు. తమతమ నియోజకవర్గాలపై సైతం దృష్టిసారించాలని అన్నారు. రైతు భరోసా పథకంపై గ్రామాల్లోనూ విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. మంత్రులతో (Ministers) మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం భేటీ అవుతానని చెప్పినట్లు సమాచారం.

  Also ReadTeacher Eligibility Test: టెట్ అభ్యర్థులకు ‘పరీక్ష’ తప్పట్లేదు.. ఈనెల 18 నుంచి 30వరకు ఎగ్జామ్స్!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..