SKN About Maruthi
ఎంటర్‌టైన్మెంట్

SKN: నాన్న అరటిపళ్లు అమ్మిన చోట.. కొడుకు కటౌట్.. ఇంతకంటే ఏం కావాలి?

SKN: సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే.. కష్టపడిన వాడికి ఇప్పుడు గుర్తింపు రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు కచ్చితంగా గుర్తింపు వస్తుంది. కసిగా పని చేసేవాడికి ఇంకాస్త ముందుగానే ఆ గుర్తింపు లభిస్తుంది. డ్రీమ్స్ నెరవేరతాయి. అందుకు ఉదాహరణ డైరెక్టర్ మారుతి అని అంటున్నారు నిర్మాత ఎస్‌కెఎన్. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi), టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. సోమవారం ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను అభిమానులు, మూవీ లవర్స్ కేరింతల మధ్య ఘనంగా నిర్వహించారు.

Also Read- Rajinikanth: ‘కన్నప్ప’ చూసిన పాపారాయుడు.. మంచు హీరోల స్పందనిదే!

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రొడ్యూసర్ ఎస్‌కెఎన్ మాట్లాడుతూ.. ఈ రోజు ‘రాజా సాబ్’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి బర్త్‌డే. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘ది రాజా సాబ్’ సినిమా టీజర్ చూశాక నిర్మాత విశ్వప్రసాద్ విజన్ ఏంటో అందరికీ తెలిసి ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరు ఎప్పటికీ గుర్తుండేలా ‘ది రాజా సాబ్’ సినిమా ఉంటుంది. దర్శకుడు మారుతి ప్రతిభ ఒక స్నేహితుడిగా నాకు బాగా తెలుసు. మారుతి వాళ్ల నాన్న మచిలీపట్నం సిరి కాంప్లెక్స్ థియేటర్ దగ్గర అరటిపళ్లు అమ్మేవారు. అక్కడ హీరోల బ్యానర్లు, కటౌట్స్ కడుతుండేవారు. వాటిని చూసిన మారుతి స్ట్రాంగ్‌గా అప్పుడే ఒక కలగన్నాడు. ఏదో ఒకరోజు తన బ్యానర్ కూడా ఆ థియేటర్ దగ్గర పెడతారని నమ్మాడు. ఇండస్ట్రీలో 21 ఏళ్ల తన కష్టం తర్వాత.. రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తూ.. ఈరోజు ఆ థియేటర్ దగ్గర తన కటౌట్ పెట్టేలా చేశాడు. ఒక మనిషి సక్సెస్‌కు, డ్రీమ్ ఫుల్ ఫిల్ అయిందని చెప్పడానికి ఇంతకంటే కొలమానం ఏముంటుంది?

Also Read- SS Rajamouli: ఎస్. ఎస్. రాజమౌళి ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా? షాకవుతారు!

మన ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ ఒకరు మారుతితో ప్రభాస్ సినిమా అనగానే చాలా నెగిటివ్‌గా మాట్లాడారు. రేపు అతనే ఈ సినిమాను పొగుడుతాడనే నమ్మకం నాకు ఉంది. ప్రభాస్ ఎంతగానో నమ్మి ఈ మూవీ చేస్తున్నారు. ఆయనకు ది బెస్ట్ ఇస్తానని మారుతి నాతో చెబుతుంటాడు. నిజంగా ఇది మూవీ లాంఛ్ కాదు, ట్రైలర్ లాంఛ్ కాదు.. జస్ట్ టీజర్ లాంఛ్. దీనికే ఇంత రెస్పాన్స్ వస్తుంటే.. రేపు డిసెంబర్ 5న ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టించడం తధ్యం. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్, కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ, రాజీవన్ వేసిన సెట్స్ అన్నీ హైలైట్‌ అవుతాయి. ఈ కార్యక్రమానికి హాజరై సక్సెస్ చేసిన మీడియా, ఫ్యాన్స్, ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అని అన్నారు.

మరోవైపు మారుతి కూడా తన తండ్రి అరటిపళ్లు అమ్మిన చోట, ఈ రోజు తన కటౌట్ చూసి ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం చెబుతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?