Manchu Heroes with Rajinikanth
ఎంటర్‌టైన్మెంట్

Rajinikanth: ‘కన్నప్ప’ చూసిన పాపారాయుడు.. మంచు హీరోల స్పందనిదే!

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కలిసి నటించిన ‘పెదరాయుడు’ (Pedarayudu) చిత్రం వచ్చి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. 15 జూన్, 1995న విడుదలైన ‘పెదరాయుడు’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా సక్సెస్‌ని అందుకుంది. సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇలా చెన్నైలో రజినీకాంత్, మోహన్ బాబు సందడి చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కన్నప్ప’ (Kannappa) సినిమాను ప్రత్యేకంగా వీక్షించినట్లుగా మంచు హీరోలు మోహన్ బాబు, విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Also Read- SS Rajamouli: ఎస్. ఎస్. రాజమౌళి ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా? షాకవుతారు!

‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించిన రజినీకాంత్ సినిమా అద్భుతంగా ఉందని విష్ణుని కొనియాడటంతో.. ఈ మేరకు విష్ణు మంచు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘కన్నప్ప’ సినిమాను రజినీకాంత్ అంకుల్ ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాను చూసిన తర్వాత నన్ను గట్టిగా హత్తుకున్నారు. చాలా గొప్ప సినిమా తీశావని, ‘కన్నప్ప’ ఎంతో నచ్చిందని ఆయన అన్నారు. ఈ క్షణం కోసం నేను గత 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా నటనను ఆయన ఎప్పుడు మెచ్చుకుంటారా? ఇలా ఎప్పుడు హత్తుకుంటారా? అని అనుకుంటూ ఉండేవాడిని. ఆ కల ఇప్పుడు నెరవేరింది. నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా ఉందని విష్ణు మంచు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘జూన్ 15కి ‘పెదరాయుడు’ సినిమా రిలీజై 30 ఏళ్లు పూర్తయ్యాయి. అదే రోజు నా ప్రియ మిత్రుడు రజినీకాంత్ ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించడం ఆ భగవంతుడి నిర్ణయంగా భావిస్తున్నాను. ఆయన తన ఫ్యామిలీతో కలిసి ‘కన్నప్ప’ మూవీని వీక్షించారు. సినిమా చూసిన తరువాత ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ మిత్రమా’’ అని అన్నారు. ప్రస్తుతం మంచు మోహన్ బాబు, మంచు విష్ణు చేసిన ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌లపై నెటిజన్లు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.

Also Read- Uppu Kappurambu: కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!

‘కన్నప్ప’ విషయానికి వస్తే.. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న చిత్రమిది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. రీసెంట్‌గా కోచిలో విడుదల చేసిన ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎం. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, మధుబాల వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?