SS Rajamouli at Kuberaa Pre Release Event
ఎంటర్‌టైన్మెంట్

SS Rajamouli: ఎస్. ఎస్. రాజమౌళి ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా? షాకవుతారు!

SS Rajamouli: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), టాలీవుడ్ కింగ్ నాగార్జున (King Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్‌లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) రూపొందించిన చిత్రం ‘కుబేర’ (Kuberaa). ఈ చిత్రం జూన్ 20వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ.. సినిమా పేరు ‘కుబేర’ కాబట్టి.. మీరందుకున్న మొదటి శాలరీ ఎంతో చెప్పాలని అడిగారు. అందుకు రాజమౌళి స్పందిస్తూ.. ‘నా ఫస్ట్ శాలరీ 50 రూపాయలు. అప్పుడు నేను అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేశాను. అప్పుడిచ్చారు.. ఆ డబ్బుల్ని ఏం చేశాననేది గుర్తు లేదు’ అని అన్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.

Also Read- Chiranjeevi: చిరుకు అప్పట్లోనే టీడీపీలోకి ఆహ్వానం.. ఎన్టీఆర్ మాట వినుంటే..?

ఇక ‘కుబేర’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్‌గా, హంబుల్‌గా ఉంటారు. ఆయనను చూసి అందరూ అదే అంటారు. కానీ ఆయన చాలా దృఢ నిశ్చయం కలిగిన పర్సన్. ఎందుకంటే, తను నమ్మిన సిద్ధాంతానికి ఏది అడ్డు వచ్చినా సరే.. ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. ఆయనలోని ఆ క్వాలిటీని నేను చాలా ఎడ్మైర్ చేస్తాను. శేఖర్ తను నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు. నిజం చెప్పాలంటే, నేను నమ్మిన సిద్ధాంతాలకి.. నేను చేసే సినిమాలకు అస్సలు సంబంధం ఉండదు. మేము కంప్లీట్ ఆపోజిట్ పోల్స్. ఆయన అంటే అందుకే నాకు అపారమైన గౌరవం. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయిందంటే నేనసలు నమ్మలేకపోతున్నాను. నాకు జూనియర్ ఏమో అనుకున్నాను కానీ నాకంటే వన్ ఇయర్ సీనియర్ తను. శేఖర్ ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు. తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీశాడు తప్పితే సైడ్ ట్రాక్‌లోకి వెళ్లలేదు. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

Also Read- Sobhita Dhulipala: మరిది అఖిల్ పెళ్లి.. టాప్ సీక్రెట్ చెప్పేసిన శోభిత.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

కింగ్ నాగార్జున, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర.. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్ కాంబినేషన్ అనుకున్నాను. ఆ తర్వాత ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసి.. అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది. ట్రాన్స్ ఆఫ్ కుబేర చూశాక మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక రిచ్ ప్రపంచంలో నాగార్జున, పూర్ ప్రపంచంలో ధనుష్.. సినిమా కథ గురించి ఏమి చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్‌ని చూపించడం చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల తన సినిమా కథని ట్రైలర్‌లోనే చెప్పేస్తుంటారు. కానీ ‘కుబేర’ విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమాలా అనిపిస్తుంది. నాగార్జున, ధనుష్‌లను ఎలా కలిపాడు? వాళ్ళ మధ్య జరిగే డ్రామా ఏంటి?.. అనేది చాలా క్యూరియాసిటీగా అనిపిస్తుంది. సినిమా కోసం నేనైతే ఈగర్‌గా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. ప్రతీది టాప్ క్లాస్‌లో వున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన నాది నాది సాంగ్, ‘కుబేర’ థీమ్ ఇవన్నీ ఫెంటాస్టిక్. సో.. జూన్ 20న డోంట్ మిస్ కుబేర’’ అని రాజమౌళి ఈ వేడుకలో ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు