Dil Raju
ఎంటర్‌టైన్మెంట్

Dil Raju: ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే.. తీసుకోవడానికి రారా? దిల్ రాజు ఫైర్!

Dil Raju: దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే.. తీసుకోవడానికి రారా? అని ప్రశ్నించారు ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల (Telangana Gaddar Film Awards) ప్రధానోత్సవం శనివారం హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ ఐఏఎస్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలతో.. సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గైడెన్స్‌తో, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు ఓవరాల్‌ సూపర్‌విజన్‌లో సక్సెస్‌ఫుల్‌గా తెలంగాణ గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను నిర్వహించుకున్నాం. అవార్డ్‌ వేడుక సక్సెస్‌కు కారణమైన ప్రతి ఒక్కరికి, సినీ అభిమానులకు, సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

Also Read- Mohan Babu: ‘కన్నప్ప’తో ‘తుడరుమ్’ కలెక్షన్స్‌ బ్రేక్ అవ్వాలి! మోహన్ లాల్ ఫ్యాన్స్‌‌కు రిక్వెస్ట్!

అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయమే లభించినా, తెలంగాణ గద్దర్‌ అవార్డుల వేడుకను బిగ్‌ ఈవెంట్‌గా నిర్వహించి గ్రాండ్ సక్సెస్‌ చేశాం. ఆరు నెలల కృషితో శనివారం రాత్రి ఈ వేడుకను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించాం. తెలంగాణ గద్దర్‌ అవార్డ్స్‌ కమిటీని రెడీ చేసి, కొన్ని రూల్స్‌, రెగ్యులేషన్స్ పాటించి ఈ అవార్డులను అందజేశాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి అవార్డులను ఇవ్వాలని కమిటీ చెప్పినప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అయినా సరే, ప్రభుత్వాన్ని ఒప్పించి 2014 నుంచి 2023 వరకు ఎంపికైన ఉత్తమ చిత్రాలకు, 2024లో ఉత్తమ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేయడం జరిగింది. పారదర్శకంగా సినిమాలను, టెక్నిషియన్స్‌ను అవార్డులకు ఎంపిక చేశాం. ఈ అవార్డుల వేడుకను చాలా బాధ్యతగా తీసుకున్నాం. నిన్న అవార్డు ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అవార్డు ఫంక్షన్‌ జరిగిన విధానంపై అందరి నుంచి మంచి ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది. ఇంత తక్కువ టైమ్‌లో అవార్డుల వేడుకను చాలా బాగా నిర్వహించారంటూ అందరూ ప్రశంసిస్తుంటే హ్యాపీగా ఉంది.

Also Read- Mohanlal: కాల్చి చంపేస్తా.. అంటూ మోహన్ బాబుకు మోహన్ లాల్ వార్నింగ్!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్లందరికి ఎఫ్‌డీసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్కలకు నా థ్యాంక్స్‌. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సీఏం ఈ వేడుక కోసం రెండున్నర గంటల పదిహేను నిమిషాలు కేటాయించారు. మొదట్లో గంట అనుకున్నారు. అయితే నా అభ్యర్థన మేరకు రెండున్నర గంటలకు పైగా ఉండి, అందరికి అవార్డులు అందజేశారు. సీఏం చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సందర్భంగా సినిమా వాళ్లకి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే ఇండస్ట్రీలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలి. షూటింగ్‌లతో బిజీగా ఉన్నా, వేరే ఈవెంట్స్‌లో ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే ఏ రాష్ట్రమైనా ఆ వేడుకకు వచ్చి అవార్డ్‌ తీసుకోవాలి. భవిష్యత్‌లో ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి అవార్డ్‌ వస్తే, ఆ వచ్చిన వారు హాజరై అవార్డును స్వీకరించాలి. ఇది నా రిక్వెస్ట్‌ అనుకోండి. ఇక ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే, తద్వారా ఎవరైనా బాధపడి ఉంటే.. వాళ్లకు ఎఫ్‌డీసీ తరపున క్షమాపణలు కోరుతున్నాను. ఈవెంట్‌ పూర్తయిన తర్వాత అందరూ అప్రిషియేట్‌ చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి, బయటి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ చాలా పాజిటివ్‌గా ఉంది. మరోసారి ఈ వేడుకను సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్స్ అని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు