Dear Uma OTT: తెలుగుమ్మాయి సుమయా రెడ్డి (Sumaya Reddy) నిర్మాతగా, హీరోయిన్‌గా, రచయితగా తన మల్టీ టాలెంట్‌ని ప్రదర్శించిన చిత్రం ‘డియర్ ఉమ’ (Dear Uma). సమాజాన్ని మేల్కొలిపే ఓ అద్భుతమైన కథతో సుమయా రెడ్డి చేసిన ఈ మొదటి ప్రయత్నం ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. మంచి సందేశాత్మక చిత్రంగా ‘డియర్ ఉమ’ను విశ్లేషకులు సైతం కొనియాడారు. నటిగా, నిర్మాతగా, కథా రచయితగా సుమయా రెడ్డికి ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. థియేటర్లలో మంచి ఆదరణను రాబట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఏ ఓటీటీలో అనుకుంటున్నారా?
Also Read- Anirudh Ravichander: ‘సన్ రైజర్స్’ కావ్య పాపతో అనిరుధ్ పెళ్లి.. మ్యాటర్ ఇదే?
‘డియర్ ఉమ’ సన్ నెక్ట్స్ (Sun NXT)లో విడుదలై ఓటీటీ వీక్షకులను ఆకర్షిస్తూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సుమయా రెడ్డి తన సొంత బ్యానర్ అయిన సుమ చిత్ర ఆర్ట్స్‌పై ఈ సినిమాను నిర్మించింది. ఆమె సరసన పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుయమా రెడ్డి స్క్రీన్ ప్లే, సంభాషణలు కూడా అందించారు.
కార్పొరేట్ రంగం, వైద్య రంగంలోని లోపాల్ని ఎత్తి చూపుతూ తీసిన ఈ ‘డియర్ ఉమ’ చిత్రం ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుమయా రెడ్డి నటన, స్క్రీన్ ప్రజెన్స్, పృథ్వీ అంబర్ పోషించిన పాత్ర ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను మెప్పించాయి. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, రాజ్ తోట సినిమాటోగ్రఫర్‌గా ఈ సినిమాకు పని చేశారు. రధన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ఎస్సెట్. మరెందుకు ఆలస్యం సన్ నెక్ట్స్‌కు ట్యూన్ అవ్వండి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు