MLC Kavitha (iagcredit:swetcha)
తెలంగాణ

MLC Kavitha: సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థులు నడుం బిగించాలి

MLC Kavitha: సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థులు నడుం బిగించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడారని అదే స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో ముందుండాలని కోరారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బీజేవైఎం నాయకుడు సాయి నాథ్‌తో పాటు వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు, విద్యార్థులు జాగృతిలో చేరారు. వారికి కండువా కప్పి తెలంగాణ జాగృతిలోకి కవిత ఆహ్వానించారు.

42 శాతం రిజర్వేషన్లు

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన సరికాదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్దరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, కానీ సీఎం ఈ ప్రకటన చేసిన గంట సేపటికే కాంగ్రెస్ అధికారికంగా ఒక ఫోటో విడుదల చేసిందని, అందులో రేవంత్ రెడ్డి లేరని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో అర్థమవుతోందన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలని సూచించారు.

Also Read: Sambasiva Rao on Kaleshwaram: కాళేశ్వరం పనికిరాదు.. ప్రాజెక్ట్ రద్దు చేయాలి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు రావడం లేదు

ఆర్ఎస్ఎస్ స్కూల్, టీడీపీ కాలేజీలో చదువుకున్నానని జాబ్ కాంగ్రెస్‌లో చేస్తున్నానని సీఎం అన్నారని, చేస్తున్న జాబ్‌లో కూడా రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు రావడం లేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు రూ 8 వేల కోట్ల మేర ఫీజు రియింబర్స్ మెంటు బకాయిలు ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య నాయకులు వర్షిత్ పెద్దరాజుల, సందీప్ దాసోజు, రాధశ్రీ, వైష్ణవి, శంకర్ గౌడ్ నాయకత్వంలో పలువురు చేరారు.

తెలుగు పీఠాధిపతులకు అవకాశమివ్వాలి: ఎమ్మెల్సీ కవిత

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై ఉన్న హాథిరామ్‌ బావాజీ మఠంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన బంజారా పీఠాధిపతులకు మాత్రమే పూజలు చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బంజారాహిల్స్‌ లోని నివాసంలో పలువురు బంజారా పీఠాధిపతులు కవితతో సమావేశమయ్యారు. తిరుమలలోని హాథిరామ్‌ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠిధిపతులకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులకు అవకాశం ఇచ్చారని తెలిపారు. తమకు అవకాశం ఇచ్చేలా టీటీడీ చైర్మన్‌, పాలకవర్గంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎమ్మెల్సీ స్పందించి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో ఫోన్‌‌లో మాట్లాడారు. శ్రీ హాథిరామ్‌ బావాజీ మఠంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన బంజారా పీఠాధిపతులు మాత్రమే పూజలు చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్పందిస్తూ పాలక మండలి సమావేశంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Also Read: Kodanda Reddy: అన్నదాతకు.. చట్టబద్ధ రక్షణ భరోసాకు కృషి!

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్