Notice to KTR (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Notice to KTR: కేటీఆర్‌కు భారీ షాక్.. నోటీసులు జారీ చేసిన ఏసీబీ.. ఎందుకంటే?

Notice to KTR: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు భారీ షాక్ తగిలింది. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆయనకు మరోమారు నోటీసులు జారీ చేశారు. ఫార్మూలా ఈ కారు రేస్ (Formula-E race case)కు సంబంధించిన కేసులో ఈ నోటీసులు అందజేశారు. సోమవారం రోజున ఉ.10 గం.లకు విచారణకు హాజరు కావాలని సూచించారు. దీంతో చాలా రోజులుగా ఎలాంటి కదలిక లేకుండా ఉన్న ఫార్మూలా ఈ కారు కేసు మరోమారు తెరపైకి వచ్చింది.

గతంలోనే విచారణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్మూలా ఈ కారు రేసులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ1గా కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్ (Aravind Kumar), ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy)లను చేర్చారు. అయితే ఈ ముగ్గురినీ గతంలోనే ఏసీబీ అధికారులు విడివిడిగా విచారించారు. కేసీఆర్ స్టేట్ మెంట్స్ ను సైతం రికార్డ్ చేశారు. తాజాగా మరోమారు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ ను ఆదేశించడం రాష్ట్రంలో చర్చకు తావిస్తోంది.

Also Read: Air India flight: మరో ఎయిర్ఇండియా విమానానికి ముప్పు.. అత్యవసర ల్యాండింగ్.. చివరికి!

సుప్రీం కోర్టు నోటీసులు
ఇటీవలే సుప్రీంకోర్టు సైతం ఓ కేసుకు సంబంధించి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ నేత ఆత్రం సుగుణ గతంలో ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ (Utnoor Police Station, Adilabad)లో ఫిర్యాదు చేశారు. దీనిని కేటీఆర్ హైకోర్టులో సవాలు చేయడంతో ఆయనకు అనుకూలంగా ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ సంజయ్ కరోన్ నేతృత్వంలోని ధర్మాసనం వివరణ కోరింది.

Also Read This: TPCC Gajjela Kantham: కాళేశ్వరం అవినీతి.. తీహార్ జైలుకు కేసీఆర్ ఫ్యామిలీ.. కాంగ్రెస్ నేత

Just In

01

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?