TPCC Gajjela Kantham (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

TPCC Gajjela Kantham: కాళేశ్వరం అవినీతి.. తీహార్ జైలుకు కేసీఆర్ ఫ్యామిలీ.. కాంగ్రెస్ నేత

TPCC Gajjela Kantham: సీఎం రేవంత్ రెడ్డి కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేస్తే ఇప్పటికే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితలు చర్లపల్లి జైల్లో ఉండే వారని పేర్కొన్నారు. వారి అవినీతిపైన
పూర్తి విచారణ చేసి తీహార్ జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రజలు వారిని తెలంగాణ నుంచి తరిమికొట్టే పరిస్థితి రానుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం అవినీతి నిజం కాదా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మరోమారు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ కార్యదర్శి గజ్జెల కాంతం హెచ్చరించారు. కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కేసీఆర్ ను విచారణ కు పిలిచారని అన్నారు. అవినీతి జరిగితే ముఖ్యమంత్రి అయినా, ప్రధాని అయినా విచారిస్తారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరు మీద మీరు అవినీతి చేసింది నిజం కాదా? అని కేసీఆర్ ఫ్యామిలీని ప్రశ్నించారు. ఇప్పుడు మీ ఆస్తులు రూ.3 లక్షల కోట్లు అన్న టీపీసీసీ కార్యదర్శి.. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు?
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని టీపీసీసీ కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన చీఫ్ ఇంజనీర్లు, అధికారులను తొలుత విచారణ చేశారని.. ఆ తర్వాతే ఈటల రాజేందర్, హరీశ్, కేసీఆర్ ను కమిషన్ దర్యాప్తునకు హాజరయ్యారని గుర్తుచేశారు. ఇందులో కేటీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అవినీతి చేసి రాష్ట్రం ఆగం అయినా విచారణ చేయొద్దా? అని ప్రశ్నించారు. తాగుబోతు అయిన కేసీఆర్.. తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని ఘాటుగా విమర్శించారు.

Also Read: Raja Raghuvanshi Case: హనీమూన్ కేసులో భారీ ట్విస్ట్.. భర్తతో పాటు మరో స్త్రీ హత్యకు కుట్ర!

మామ అల్లుళ్లు అడ్డంగా దొరికారు
మరోవైపు నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం.. కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం పై విచారణ జరుగుతుండడంతో కెసీఆర్ కుటుంబం ప్రస్టేషన్ లో ఉందని విమర్శించారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాళేశ్వరం పేరిట అడ్డంగా దోపిడీ చేశారని.. కమిటీ విచారణకు పిలవడంతో అవినీతి బయటపడుతుందని సీఎం రేవంత్ పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లేదని.. కాళేశ్వరం అవినీతిలో మామ అల్లుడు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు.

Also Read This: Bail to Kommineni: కొమ్మినేనికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!