DD Next Level
ఎంటర్‌టైన్మెంట్

DD Next Level: ఓటీటీలోకి వచ్చేస్తున్న దడ పుట్టించే కామెడీ సినిమా.. ఎందులో అంటే?

DD Next Level: హర్రర్-కామెడీ జానర్‌ సినిమాలు ఫెయిలవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ప్రేక్షకులు ఈ జానర్‌ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ జానర్ అంటే ఎంతిష్టమో.. ఇప్పటికే ఈ జానర్‌లో వచ్చిన సినిమాలు నిరూపించాయి. హర్రర్-కామెడీ జానర్‌లో తెరకెక్కి.. కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ (Devils Double: Next Level) చిత్రం ఇప్పుడు ఓటీటీలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులోకి వస్తోంది. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Allu Aravind: ఫేక్ ఐడీతో అమ్మాయిల్ని ఫాలో అవుతుంటా.. అసలు విషయం అదన్నమాట!

జీ5 ఓటీటీలో ఈ హర్రర్-కామెడీ ఫిల్మ్ జూన్ 13న ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా? అనే సెర్చింగ్‌తో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో బాగా ఆకర్షించి.. సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తున్నాయి. చిత్రంలోని కామెడీ, హారర్ ఎలిమెంట్స్ థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతిక తివారీ నటించిన ఈ చిత్రం ZEE5 వీక్షకులను ఈ శుక్రవారం నుంచి ఎంటర్‌టైన్ చేయబోతుంది. మరెందుకు ఆలస్యం మరికొన్ని గంటల్లో వచ్చే ఈ సినిమా కోసం ట్యూన్ అవండిక.

Also Read- Trivikram Srinivas: ట్విస్ట్ అదిరింది.. అల్లు అర్జున్, రామ్ చరణ్ అవుట్.. ఎన్టీఆర్‌ ఫిక్స్!

‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా అంతా కూడా సినీ విమర్శకుడు కిస్సా (సంతానం) చుట్టూ తిరుగుతుంది. అతను అసాధారణ దర్శకుడు హిచ్‌కాక్ ఇరుధయరాజ్ (సెల్వరాఘవన్) ప్రైవేట్ స్క్రీనింగ్‌లోకి రావడం, అక్కడే చిత్రంలో ఇరుక్కుపోయి.. బయటకు వచ్చేందుకు ప్రయత్నించడం వంటి కామెడీ, హారర్ అంశాలతో ఆద్యంతం వినోద భరితంగా దర్శకుడు తెరకెక్కించారు. కిస్సా తనకు దొరికిన ఆధారాలను డీకోడ్ చేస్తూ బయటకు ఎలా వచ్చాడన్నదే ఈ సినిమా మెయిన్ కథాంశం. ఇంతకు ముందు ఈ సిరీస్‌లో వచ్చిన ‘డిడి: రిటర్న్’ (DD మంచి విజయాన్ని అందుకోగా, ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ రూపుదిద్దుకుంది. డైరెక్టర్ ఎస్. ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిజంగానే నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కించారు. ముఖ్యంగా సంతానం కామెడీ టైమింగ్, గౌతమ్ మీనన్ ట్రాక్.. ఇలా అన్నీ కూడా నెక్ట్స్ లెవలే అన్నట్లుగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో రివ్యూవర్స్‌పై దర్శకుడు కౌంటర్లు సంధించారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో చూడాలి.

కమెడియన్ సంతానం హీరోగా చేసిన చిత్రాలలో ఈ సిరీస్ చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఈ సినిమాల సక్సెస్‌లతో.. ఈ సిరీస్‌లో ఇంకొన్ని సినిమాలు చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఆ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ