Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, సినీ ఇండస్ట్రీలో ( Telugu Industry) నటిగా.. నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2024 లో కమిటీ కుర్రాళ్లతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా తీస్తూ నిహారిక హిట్స్ అందుకుంది. అంతే కాదు, తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసిన గద్దర్ అవార్డుకు కూడా మెగా డాటర్ ఎంపికైంది. పెద్ద నాన్న మెగా స్టార్ చిరంజీవి ( Megastar chiranjeevi) , బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) పెద్ద హోదాలో ఉన్నా కూడా ఎవరి సపోర్ట్ లేకుండా సొంతగా ఎదిగి పేరు తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మకి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
Also Read: Hero Dhanush: నేను, రష్మిక 7 గంటల పాటు ఆపకుండా ఆ పని చేశాం.. హీరో ధనుష్ షాకింగ్ కామెంట్స్
గోరింటాకు, మల్లె పూలతో నిహారిక స్టోరీ?
ఎప్పుడూ తన ఫొటోస్ మాత్రమే షేర్ చేసే నిహారిక కొణిదెల .. మొదటి సారి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొత్త ఫొటోను షేర్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆ ఫొటో కూడా చూడటానికి కొత్తగా ఉంది. చీర, మల్లె పూలు, చేతికి గోరింటాకు తో బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఫొటో చూసి చాలా మంది సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుందా అని అంటున్నారు. ఎందుకంటే, పట్టుచీర ధరించి.. చేతికి గోరింటాకు పెట్టుకుని.. మల్లె పూలు ఉండటంతో పలు అనుమానాలు వస్తున్నాయి.
Also Read: Suniel Narang: ‘హరి హర వీరమల్లు’ ఎఫెక్ట్.. టిఎఫ్‌సిసి అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా!
ఆమె అంతక ముందు చేసుకున్న మొదటి పెళ్లిలో భర్తతో విబేధాలు రావడంతో విడాకులు ఇచ్చి కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని సినిమాల వైపు వెళ్ళింది. అయితే, మళ్లీ ఇప్పుడు మనసు మార్చుకుని రెండో పెళ్లి పై దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి టాక్ నడుస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఆఫీసులో ప్రత్యేక పూజలు కూడా చేసింది. వేద పండితులతో చండీ హోమం ఫొటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఆ హీరోతో సీక్రెట్ గా నిహారిక ఎంగేజ్మెంట్?
Also Read: Warangal Museum: మ్యూజియం కూలకుండా కర్రల సపోర్ట్.. ఓరుగల్లు చారిత్రాత్మక సంపదకు దిక్కేది..?
రీసెంట్ గా ఇంట్లో పూజలు జరిపించగా .. ఇక ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో కూర్చున్న ఫొటోను ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడం చూస్తుంటే నిహారిక సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకునే ఉంటుందని చాలా మంది అంటున్నారు. అంత సడెన్ గా పూజలు ఎందుకు చేసింది? మళ్లీ ఇప్పుడు ఈ ఫొటో పెట్టడం ఏంటి ? చూడబోతుంటే అందరూ అనుకునే తెలుగు హీరోతో ఎంగేజ్మెంట్ అయిపోయే ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.