IAS Srilakshmi (imagecredit:twitter)
తెలంగాణ

IAS Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు భారీ షాక్.. మరోసారి విచారణ!

IAS Srilakshmi: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీం కోర్టు నుంచి షాక్ తగిలింది. ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో ఆమెపై నమోదైన కేసును మరోసారి విచారించాలంటూ సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కేసును నేడు లిస్ట్ చెయ్యనుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిన విషయం తెలిసిందే. దీంట్లో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీ ఖాన్ తోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. అనంతరం నాంపల్లిలోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

తమపై కేసులు కొట్టి వెయ్యాలంటూ..

విచారణ జరుగుతుండగానే సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి తమపై నమోదైన కేసులను కొట్టి వెయ్యాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరిపై కేసులు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా, ఇటీవల సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీ ఖాన్‌లకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అదే సమయంలో సీబీఐ శ్రీలక్ష్మిపై కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ శ్రీలక్ష్మిపై మరోసారి విచారణ చెయ్యాలంటూ హైకోర్టును ఆదేశించింది.

Also Read: Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్ రావును సిట్ అడిగిన ప్రశ్నలు ఇవే!

అక్రమ మైనింగ్ లైసెన్స్‌లు

2025 మే 6న, సీబీఐ ప్రత్యేక కోర్టు గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీ ఖాన్‌లకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో, సీబీఐ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2025 మే 7న, సుప్రీం కోర్టు హైకోర్టు 2022 తీర్పును కొట్టివేసి, శ్రీలక్ష్మిపై కేసును మరోసారి విచారించాలని, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అక్రమ మైనింగ్ లైసెన్స్‌లు మంజూరు చేయడంలో దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ తాజా పరిణామం ఆమెపై మరోసారి చట్టపరమైన పరిశీలనను తీసుకువచ్చింది.

Also Read: IAS Bribe Scandal: అడ్డంగా దొరికిన ఐఏఎస్.. ఇదేం పాడు పనయ్యా నీకు?

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?