Bala Bharosa: బాల భరోసా పేరుతో కొత్త స్కీం ను తీసుకొస్తున్నామని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదేండ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తామని, ఏదైనా సమస్య ఉంటే అవసరమైన సర్జరీలు ఉచితం చేయిస్తామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి సీఎం రేవంత్ రెడ్డి ప్లాగ్ షిప్ కార్యక్రమం అని పేర్కొన్నారు.
కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే లక్ష్యంతో కలెక్టర్లు పనిచేయాలన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్నారు. మహిళా సంఘాలచే సోలార్ ప్లాంట్లు, పెట్రెల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు. వాటికి అవసరమైన స్థలాలను తక్షణం గుర్తించి పనులు ప్రారంభించాలన్నారు. అక్టోబర్ 2 న సోలర్ ప్లాంట్లు ప్రారంభించే లక్ష్యంతో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Also Read: Land Encroachments: ఫేక్ నోటరీలతో భూ ఆక్రమణలు.. ఓ కాంగ్రెస్ నేత అంతులేని ఆగడాలు!
ఇప్పటికే జిల్లాల వారిగా సోలార్ ఇనస్టాలేషన్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని, వారితో సమన్వయం చేసుకుని సోలార్ ప్లాంట్ల పనులు ప్రారంభించాలన్నారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులను నవంబర్ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ బడులు బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని, వాటి ప్రభావం తెలంగాణ భవిష్యత్తు మీద ఉంటుందని, వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అన్నారు. పాఠశాల తెరిచే రోజు విద్యార్దులందరికి యునిఫాంలు పంపిణీ చేస్తామన్నారు.
అంగన్ వాడీ లు ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ప్రైవేటు ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలన్నారు. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలు నిర్మించబోతున్నామన్నారు. వాటికి కావాల్సిన స్థలాలను సేకరించాలని సూచించారు. మహిళా స్వయం సహయక బృందాల్లో కొత్త సభ్యులను చేర్చాలనిసూచించారు. దివ్యాంగుల దృవీకరణ పత్రాల కోసం 38 ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, సకాలంలో దివ్యాంగులకుదృవీకరణ పత్రాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: HC Lawyer Kidnap case: హైకోర్టు న్యాయవాది కిడ్నాప్.. కోటి రూపాయల డిమాండ్!