Kavitha on CM Revanth (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Kavitha on CM Revanth: సీఎం రేవంత్‌పై కవిత ఫైర్.. వాటిపై తక్షణ చర్యలకు డిమాండ్

Kavitha on CM Revanth: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ముఖ్యనేత కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోమారు మండిపడ్డారు. రాష్ట్రంలో ఆలయాలు, వాటి నిర్వహణ, అభివృద్ధిలో రేవంత్ సర్కార్ (Telangana Govt) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కవిత.. తాజాగా ఇందల్వాయిలోని రామాలయాన్ని (Indalwai Ramalayam Temple) సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వేములవాడలో రోజుకొక రాజన్న కోడె మరణిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

తెలంగాణలోని ఆలయాలపై ఏమాత్రం శ్రద్ధ ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. రాజన్న కోడెల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని కవిత అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశామని కవిత అన్నారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు.

Also Read: Bandi Sanjay: ప్రభాకర్ రావు లొంగుబాటు.. కేసీఆర్ ప్లానే.. బండి షాకింగ్ కామెంట్స్

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కవిత పూర్తిగా విఫలమయ్యారని కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెప్పినట్లుగా రూ.2,500 ఇచ్చేంత వరకూ పోరాటం చేస్తామని అన్నారు. కల్యాణలక్ష్మిలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read This: MLA Harish Rao: కాళేశ్వరం కమిషన్ విచారణ.. హరీశ్ రావు సంచలన ప్రెస్ మీట్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!