తెలంగాణ

Minister Kishan Reddy: భూగర్భ గనుల తవ్వకాల్లో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి!

Minister Kishan Reddy: భారతదేశ అభివృద్ధిలో జీఎస్ఐ (భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ) కీలకపాత్ర పోషిస్తుందని, పారిశ్రామిక అభివృద్ధికి గనులు ఎంతో అవసరమని, పర్యావరణానికి హాని జరగకుండా గనుల తవ్వకాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాగోల్‌ డివిజన్ లో జీఎస్ఐ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో భారత ప్రభుత్వం గనుల శాఖకు చెందిన Geological Survey of India (GSI) ఆధ్వర్యంలో “Next Gen Geophysics 2025 – Unlocking Earth’s Hidden Treasures” సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హాజరయ్యారు.

Also Read: bhadradri kothagudem: ఆదివాసుల బాధలు.. తీర్చేవారే లేరా..?

జీఎస్ఐ కీలక పాత్ర

భూగర్భ గణాంకాల ప్రాధాన్యతను వివరించారు. అభివృద్ధి చెందుతున్న భారత భవిష్యత్తులో జీఎస్ఐ కీలక పాత్రను వివరిస్తూ, ఆధునిక సాంకేతికత అవసరమని సూచించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. పరిశోధన ఆధారిత డేటా, ఆధునిక టెక్నాలజీ ద్వారా పర్యావరణ అనుకూలమైన గనుల తవ్వకాలు ఎలా సాధ్యమవుతా యన్న దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భూగర్భ గణాంకాలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదం చేస్తున్నాయని చెప్పారు.

నూతన సాంకేతికతలపై చర్చలు

ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భౌతిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు పాల్గొని నూతన సాంకేతికతలపై చర్చలు జరిపారు. భూగర్భ సంపదల పరిశోధనలో ఉపయోగించే డేటా విజువలైజేషన్ టూల్స్, తక్కువ నష్టం కలిగించే తవ్వకాలు తదితర అంశాలపై ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్ డివిజన్ల కార్పొరేటర్లు చింతల అరుణాసురేంద్రనాథ్ యాదవ్, కొప్పుల నర్సింహ రెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మేకల శిల్పా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, మహిళా మోర్చా నాయకులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Mahesh Kumar Goud: ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు.. పీసీసీ చీఫ్​ సంచలన వాఖ్యలు!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు