MLA Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) విచారణకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao).. ఇవాళ కమిషన్ విచారణకు హాజరయ్యారు. కమిషన్ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రతీ ప్రశ్నకు ఆధారాలతో సహా ఆన్సర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ పై
కాళేశ్వరం ప్రాజెక్టును తమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు నిర్మించలేదని కమిషన్ అడిగినట్లు హరీశ్ రావు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తమ్మిడిహాట్టి ప్రాజెక్ట్ నిర్మించేందుకు 28 ప్యాకేజీలకు అనుమతులు ఇచ్చారని హరీశ్ రావు అన్నారు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టుకు అనుమతి రాలేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఇదే విషయాన్ని అప్పటి మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖకు చెప్పినట్లు హరీశ్ రావు తెలిపారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఒప్పుకోలేదని.. తాము ఒప్పుకోమని మహారాష్ట్ర (Maharashtra)లోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) చెప్పిందని గుర్తుచేశారు.
నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం
తమ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో 5, 6 మీటింగ్స్ జరిగాయని.. అందులోని ఓ కీలక సమావేశంలో కేసీఆర్ (KCR) పాల్గొన్నారని చెప్పారు. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని మహారాష్ట్రకు చెప్పామని.. స్వయంగా సీఎం హోదాలో వచ్చి కేసీఆర్ చెప్పిన అప్పటి మహారాష్ట్ర సర్కార్ ససేమీరా అన్నారని హరీశ్ రావు అన్నారు. తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే ఒప్పుకునేది లేదని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందని స్పష్టం చేశారు. అయితే మేడిగడ్డ (Medigadda) దగ్గర నీళ్లు ఉన్నాయని కేంద్రం ఆధీనంలోని వ్యాప్సోక్ సంస్థ తమకు చెప్పిందని హరీశ్ అన్నారు. నీళ్లు ఉన్న దగ్గర ప్రాజెక్ట్ కట్టుకోవాలన్న వ్యాప్కోస్ సూచనల మేరకు మేడిగడ్డ నిర్మించినట్లు హరీశ్ రావు పేర్కొన్నారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావును సిట్ అడిగిన ప్రశ్నలు ఇవే!
వాటికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి!
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి ఉందా? అన్న ప్రశ్నకు ఉంది అని బదులు ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం ఎంత అని అడగ్గా.. 141 TMC అని కమిషన్ కు చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ ఇటీవల గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. ఆ ప్రాజెక్టుకు వచ్ేచ నీళ్లు ఎక్కడివో సమాధానం చెప్పాలని నిలదీశారు. మూసిని సుందరీ కరణ చేసి.. మల్లన్న సాగర్ నుంచి మూసికి నీళ్లు తీసుకొస్తామని చెప్తున్నారని.. ఆ నీరు ఎక్కడవిలో బదులు చెప్పాలని ప్రశ్నించారు. ఎప్పటికైనా తెలంగాణకు జీవదార కాళేశ్వరం ప్రాజెక్టేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.