OTT ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఇదే

OTT : ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, కొత్త సిరీస్ లు ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాయి.
కామెడీ మూవీస్ తో పాటు హారర్ చిత్రాలు కూడా మన ముందుకు వస్తున్నాయి. రానా నాయుడు సీజన్ 2 , సింగిల్, దేవిక &డానీ , ఎలెవన్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

రానా నాయుడు

స్టార్ హీరో వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన యాక్షన్ మూవీ ‘రానా నాయుడు’ సీజన్ 2. సీజన్ 1 రిలీజ్ అయి నప్పుడు చాలా మంది ఫైర్ అయ్యారు. వాటిలో కొన్ని సీన్స్ అసలు బాగాలేవని జనాలు మండి పడ్డారు. అయితే, సీజన్ 2 జూన్ 13 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 1 లో జరిగిన తప్పులను సరి చేసుకుని.. సీజన్ 2 తో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు.

దేవిక & డానీ

రీతూ వర్మ మెయిన్ లీడ్ లో నటించిన కామెడీ ఎంటర్ టైనర్ దేవిక &డానీ. ఈ మూవీ ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా.. నేరుగా ఓటిటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి కిషోర్ డైరక్షన్ చేశారు.

భూల్‌ చుక్‌ మాఫ్‌

రాజ్ కుమార్ రావు, వామికా కలిసి నటించిన రొమాంటిక్ మూవీ ‘భూల్‌ చుక్‌ మాఫ్‌’. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మే 23న రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

పెళ్లికాని ప్రసాద్

సప్తగిరి, ప్రియాంక శర్మ కలిసి నటించిన మూవీ ‘పెళ్లికాని ప్రసాద్ ‘ . ప్రస్తుతం, ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

లెవెన్

నవీన్ చంద్ర మెయిన్ లీడ్ లో నటించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘లెవెన్’ సినిమా ఈనెల 13 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. లోకేష్ అజిల్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో రియా హరి, అభిరామి, శశాంక్‌ నటి నటులు నటించారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?