Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ను ప్రస్తుతం సిట్ విచారిస్తోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ (DCP Vijay Kumar) నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి ఆయన ఇస్తున్న సమాధానాలను స్టేట్ మెంట్స్ రూపంలో అధికారులు రికార్డ్ చేస్తున్నారు. విచారణ ప్రక్రియ మెుత్తాన్ని పోలీసులు వీడియోలో రికార్డ్ చేస్తున్నారు. ప్రభాకర్ రావును ఇప్పటివరకూ సంధించిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రశ్నలు ఇవే!
1. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు చెప్పాలనుకుంటున్నారు?
2. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన వెంటనే మీరు విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారు?
3. కేసు నమోదు అయిందనే సమాచారం తోనే విదేశాలకు పారీపోయారా ?
4. మీరు రాజీనామా చేసిన రోజు హార్డ్ డిస్క్ లను ధ్వసం చేశారు ?
5. ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసినట్లు చెప్పాడు ? మా దగ్గర స్టేట్మెంట్ ఉంది మీరేమంటారు ?
6. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్ ను ఎవరు చెపితే ఏర్పాటు చేశారు ?
7. ఈ టీమ్ ఏర్పాటు గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఏర్పాటు చేశారా ?
8. నాలుగు వేల కు పైగా ఫోన్ లు ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.. ఈ నెంబర్లు ఎవరు ఇచ్చారు ?
9. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసులు అధికారులందరూ మీ పేరే చెప్తున్నారు ?
10. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేశారు.. ఇందులో కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కదా ?
11. సాధారణ ఎన్నికల్లో BRS పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్ లను , ఇతర ఆధారాలను ధ్వసం చేయాలని ముందే ప్లాన్ చేశారా ?
12. ప్లాన్ ప్రకారమే ఎన్నికల ఫలితాల రోజు రిజైన్ చేసి , ఆధారాలను మాయం చేశారా ?
13. . శ్రవణ్ రావు ప్రయివేటు వ్యక్తి.. అతనితో SIB కి ఏంటి సంబంధం ?
14. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ లను సైతం ఎందుకు ట్యాప్ చేశారు.. మీకు ఎవరైనా పెద్దలు ఆదేశాలు ఇచ్చారా ?
15. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు సమయంలో కేవలం విపక్ష పార్టీల నాయకులు ఫోన్లు ట్యాప్ చేసే టాస్క్ ఫోర్స్ పోలీసులతో డబ్బులు సీజ్ చేశారా?