- ఎల్ అండ్ టీ కక్కుర్తే కొంప ముంచుతోందా?
- ట్రాక్ చుట్టూ ఇష్టారాజ్యంగా హోర్డింగ్స్
- రాత్రి కాగానే పవర్ సప్లై డౌన్ అవుతోందా?
- ఎల్ అండ్ టీని అలర్ట్ చేసిన హెచ్ఎంఆర్ఎల్?
- రైల్వే సేఫ్టీ అథారిటీతో కాకుండా జేఎన్టీయూతో సర్టిఫికెట్స్?
- ఇటీవలే బోల్ట్ పడి వాహనదారుడికి గాయాలు!
- ఒక్కసారి సమస్య వస్తే ఆటంకాలు తప్పవంటున్న నిపుణులు
- ఎల్ అండ్ టీ వర్సెస్ హెచ్ఎంఆర్ఎల్‌గా వ్యవహారం?
- జీహెచ్ఎంసీకి రూ.150 కోట్ల దాకా పేరుకుపోయిన బకాయిలు
- మేడిగడ్డ గుణపాఠంతోనైనా మెట్రో విషయంలో జాగ్రత్త పడలేరా?
- ఎల్ అండ్ టీ అజాగ్రత్త, ఆశలపై స్వేచ్ఛ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్
Hyderabad Metro: మేడిగడ్డ కుంగుబాటులో తప్పించుకునేందుకు ఎన్డీఎస్ఏ (NDSA) రిపోర్టునే తప్పుపట్టిన ఎల్ అండ్ టీ (L & T) తప్పిదాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హైదరాబాద్ మెట్రోను కూడా ప్రమాదపు అంచుల్లోకి నెడుతున్నదనే విమర్శలు మొదలయ్యాయి. రైల్వే సేఫ్టీ అథారిటీ ద్వారా క్లియరెన్స్ రాకుండానే నెలకు 8 కోట్ల ఆదాయం కోసం పడుతున్న ఆరాటంపై అనేక అనుమానాలకు దారి తీసింది. అటు జీహెచ్ఎంసీకి కట్టాల్సిన ట్యాక్స్ రూ.150 కోట్లకు పేరుకుపోయినా అడిగే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే మేడిగడ్డ (Medigadda) బ్యారేజ్ కుంగుబాటుతో ఎల్ అండ్ టీ పనులపై అనేక సంస్థలు జాగ్రత్తపడుతున్నాయి. సందరు కంపెనీ పనులపై మరోసారి క్వాలిటీ చెకింగ్స్ చేసుకుంటున్నాయి. అంత పేరొందిన కంపెనీకి ఎన్డీఎస్ఏ రిపోర్టుతో భవిష్యత్‌లో ప్రాజెక్ట్‌లు అప్పగించాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాయి.
మెట్రోకు ప్రమాదం ఎక్కడంటే?
ఎల్ అండ్ టీ మెట్రో ట్రాక్‌పై బోర్డులు పెట్టుకునేలా నామినేషన్ పద్దతిలో అడ్వటైజింగ్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. చౌరస్తా దగ్గర మెట్రో వెళ్లితే చాలు 30 ఫీట్ల నుంచి 60 ఫీట్ల వరకు 20 ఫీట్ల నుంచి 40 ఫీట్ల హైట్ వరకు వేసుకుంటూ వెళుతున్నారు. ట్రాక్, ప్యాసింజర్ బరువుతో పాటు మరో రెండింతల వెయిట్ భరించేలా మెట్రోను నిర్మించారు. అయితే, ట్రాక్ సైడ్‌కు అడ్వటైజింగ్ బోర్డులు పెడుతున్నారు. వాటికోసం సైడ్ వాల్స్, ట్రాక్ ఉండే కింది భాగంలో హోల్స్ చేస్తున్నారు. ఆ హోల్స్ ఇష్టానుసారంగా చేయడంతో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే సగం వరకే నిర్మించారు. ఇంకా సగం నిర్మించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో కొన్నింటికే అనుమతి ఇచ్చిన ఎల్ అండ్ టీ ఇప్పుడు అన్ని మెట్రో స్టేషన్‌లలో చిన్న ఖాళీ ప్రాంతాన్ని కూడా వదలకుండా నింపేస్తున్నది. దీంతో ఒక్కొక్క గోడకు, బీమ్స్‌కు పట్టు కోల్పొయేలా రంద్రాలు అవుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా హోల్స్ చేయడంతో మెట్రో స్టేషన్ పిల్లర్స్, బీమ్స్‌తో పాటు ట్రాక్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో వీటిపై హైకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. వారితో బలవంతంగా విత్‌డ్రా చేయించడంలో అడ్వటైజింగ్ ఏజెన్సీలు సక్సెస్ అయ్యాయి. రైల్వే సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదులు వెళ్లకుండా అడ్వటైజింగ్ మాఫియా అందరినీ మేనేజ్ చేసినట్లు వినికిడి.
లో ఓల్టేజ్ పవర్‌ను అధిగమించి?
మెట్రో రైలుతో పాటు స్టేషన్స్‌లో కరెంట్ సాఫీగా కొనసాగేలా అయ్యేంత డిమాండ్ వరకే సప్లై సిస్టమ్ ఉంటుంది. కానీ, ఎల్ అండ్ టీ అదనపు ఆదాయం కోసం ఏర్పాటు చేస్తున్న అడ్వటైజింగ్ బోర్డులతో సమస్యలు ఎదురయ్యాయి. సాయంత్రం 6 అయిందంటే హోర్డింగ్స్‌కు ఫోకస్ లైట్స్ ఎక్కువగా వాడుతున్నారు. దాని కోసం ప్రొవైడ్ చేసే విద్యుత్‌లో నుంచే ఆ లైన్ తీసుకోవడంతో సమస్య తలెత్తింది. కొద్ది రోజుల క్రితం మెట్రో రైళ్లు రాత్రి వేలలో స్లోగా వెళ్లాయి. ఇదంతా లో ఓల్టేజీ వల్లేనన్న ప్రచారం ఉంది. ఒక్కోసారి సాంకేతిక లోపం కూడా వస్తున్నది. ముందే గ్రహించిన హెచ్ఆర్ఎంఎల్ ఎల్ అండ్ టీకి లేఖ కూడా రాసింది. దీంతో హై ఓల్టేజ్ పవర్ సప్లై అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
ఎల్ అండ్ టీ వర్సెస్ హెచ్ఎంఆర్ఎల్?
మెట్రో నిర్వహణలో ఎల్ అండ్ టీకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు ప్రత్యుత్తరాలు కామన్. ఇటీవలి కాలంలో నామినేషన్ పద్దతిలో రైల్వే ట్రాక్‌కు ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్ బోల్ట్ వాహనదారుడిపై పడి గాయాలయ్యాయి. దీంతో విషయం బయటకు పొక్కకుండా సదురు వ్యక్తికి 25 లక్షల నష్టపరిహారం ఇచ్చారని సమాచారం. ఇప్పటికే రైల్వే స్టేషన్స్ వద్ద పెచ్చులూడి పలు మార్లు కింద పడ్డాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని రైల్వే సేఫ్టీ అథారిటీ నుంచి సర్టిఫికెట్ కావాలని హెచ్ఎంఆర్ఎల్ కోరింది. ఇందుకు నిర్లక్ష్యంగా తమ సేఫ్టీ ఏంటో తమకు తెలుసని ఎల్ అండ్ టీ 3 వ్యాఖ్యలతో రిప్లై ఇచ్చినట్లు సమాచారం. భవిష్యత్తులో ప్రమాదం జరిగితే తాము రాసిన లేఖలు పనికొస్తాయనే ధోరణిలో హెచ్ఆర్ఎంఎల్ తీరు ఉన్నట్టు తెలుస్తున్నది.
Read Also- Congress Party: అసంతృప్తుల పరిస్థితి ఏమిటో? వరుసగా బుజ్జగింపులు!
ఫిర్యాదులు, కేసులు వేసినా సెటిల్మెంట్లతో సైలెంట్
లక్షల కోట్లు ఉన్న ఎల్ అండ్ టీ నెలకు 8 కోట్లకు ఆశ పడి సేఫ్టీ అంతా మూడో పార్టీ చేతులో పెడుతున్నది. ఒక్క దగ్గర సమస్య వస్తే ఆ లైన్ అంతా రైలు నడవకుండా ఆగాల్సిందే. ఎంతో సిస్టమేటిక్‌గా ఉండాల్సిన ప్రాంతంలో ఇష్టానుసారంగా హోల్స్ చేసి హోర్డింగ్స్ పెట్టడం, రైల్వే సేప్టీ అథారిటీ కాకుండా జేఎన్టీయూ నుంచి టెస్ట్‌లు చేయించామని చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నది. ఈ అంశంపై గతంలో ఎంఏయూడీకి ఎన్నో ఫిర్యాదులు అందాయి. హైకోర్టులో కేసులు వేశారు. వాటన్నింటిని విత్ డ్రా చేసుకునేలా ఒత్తిళ్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, రైల్వే సేఫ్టీ అథారిటీకి లేఖలు సైతం వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
ట్యాక్స్ చెల్లించడం లేదు?
సోమేశ్ కుమార్ సీఎస్‌గా ఉన్నప్పుడు మెట్రో అడ్వటైజింగ్‌పై ఎల్ అండ్ టీ స్క్వేర్ మీటర్‌కు రూ.35 జీహెచ్ఎంసీకి చెల్లించాలని జీవో ఇచ్చారు. అలా 2019 నుంచి ఇప్పటి వరకు నామినేషన్ పద్దతిలో ఇచ్చిన అడ్వటైజింగ్ బోర్డ్స్‌పై జీహెచ్ఎంసీకి రూ.150 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఏడాదికి కోటి, రెండు కోట్లు చెల్లిస్తూ చేతులు దులుపుకుంటున్నది. నామినేషన్ పద్దతిలో కొద్దిపాటి డబ్బులకే మెట్రోను ఎక్కడిక్కడ అమ్మేసుకోవడం ఆశ్చర్యానికి గుర చేస్తున్నది.
ఎల్ అండ్ టీ పనులపై అనుమానాలు.. టెండర్స్‌లో ఇష్టారాజ్యం
గత ప్రభుత్వంలో ఎల్ అండ్ టీ టెండర్స్ తక్కువగా కోట్ చేసి ఆ తర్వాత భారీగా ధరలు పెంచుకున్నారు. అందుకు కాళేశ్వరం, వరంగల్ టిమ్స్ సహా ఎన్నో ఉదాహరణలున్నాయి. అయితే, కాళేశ్వరం పనుల్లో కుంగిపోయిన పార్ట్‌ను కన్‌స్ట్రక్షన్ చేసిన ఎల్ అండ్ టీ కంపెనీకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మింగుడు పడడం లేదు. 9 టెస్టులు చేసి వారి అత్యుత్సాంహంతో చేసిన పనులను ఎన్డీఎస్ఏ ఎండగట్టింది. దీంతో తమ కంపెనీ భవిష్యత్తుకు ఇబ్బందులు వస్తాయని భావించి ఆ రిపోర్టునే తప్పు అంటూ లేఖ రాసింది. దీనికి తోడుగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను వెనుకేసుకొచ్చింది. ఇప్పుడు మెట్రో నిర్మించిన ఎల్ అండ్ టీ 8 కోట్ల కోసం పడుతున్న కక్కుర్తి వల్ల ఏకంగా ప్రాజెక్ట్ ప్రమాదం అంచుల్లో నిలుపుతున్నది. రైల్వే సేఫ్టీ అథారిటీ నుంచి పూర్తి రక్షణ సర్టిఫికెట్ వచ్చాకనే ఈ హోర్డింగ్స్ వ్యవహారాన్ని కొనసాగించేలా ఉండాలి. లేదంటే మెట్రో మొత్తం హోల్స్‌తో నింపేసి ప్రకటనలతో కప్పేసి ప్రమాదపు అంచులో నెట్టివేసే అవకాశాలు లేకపోలేదు.
Read Also- Gold Rate ( 09-06-2025): మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్..