Samantha: సమంత, నాగ చైతన్య ప్రేమించి, పెళ్లి చేసుకుని విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీళ్ళు విడిపోతారని అస్సలు అనుకోలేదు. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ లవ్ లీ కపుల్ విడిపోయి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే, తాజాగా సమంతకి సంబందించిన పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఆమె చెప్పిన మాటలు వింటే .. ఇద్దరూ కలిసి ఉంటే చాలా బాగుండేదని అనుకునే వాళ్ళు. ఇంతకి ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడిందో ఇక్కడ తెలుసుకుందాం ..
సమంతను ఫస్ట్ లవ్ గురించి అడిగితే.. నా ఫస్ట్ లవ్ చై.. నాగ చైతన్య అక్కినేని అని చెప్పింది. వాస్తవానికి దాని కంటే, ముందు హీరో సిద్దార్ధ కూడా ఉన్నాడు. ఆయన కదా ఫస్ట్ లవ్.. కానీ, ఎవరూ ఊహించని విధంగా నాగ చైతన్య పేరు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, ఆ వీడియో పాతది కావడంతో అప్పట్లో వీరిద్దరూ భార్య భర్తలు కాబట్టి.. ఆ ప్రేమ తోనే అలా చెప్పి ఉంటాది. అది, ఇప్పుడు వైరల్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.