Kamal Haasan (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kamal Haasan: బాలీవుడ్‌పై ఓపెన్ అయిన కమల్.. మూవీస్ చేయకపోవడంపై షాకింగ్ కామెంట్స్!

Kamal Haasan: దేశంలోని అతికొద్ది మంది సుప్రసిద్ధ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయనకు భారత్ తో పాటు విదేశాల్లోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. తన నటనతో లోకనాయకుడిగా గుర్తింపు సైతం పొందాడు. ప్రధానంగా తమిళ నటుడైన కమల్.. తెలుగు చిత్ర పరిశ్రమమైనా చెరగని ముద్ర వేశారు. మలయాళంలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే హిందీలో ఆయన పెద్దగా పాపులర్ కాకపోవడం ఎప్పుడూ చర్చకు తావిస్తూనే ఉంది. బాలీవుడ్ లో కమల్ పెద్దగా సినిమాలు కూడా చేసింది లేదు. తాజాగా తన థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కమల్ కు ఈ అంశంపై ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.

ఇంతకీ కమల్ ఏమన్నారంటే?
తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా సూపర్ సక్సెస్ అయిన కమల్ హాసన్.. కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ లోనూ కొన్ని చిత్రాలు చేశారు. ఆ తర్వాత సడెన్ గా బాలీవుడ్ నుంచి పక్కకు వచ్చి.. తనకు ఎంతో ఇష్టమైన తెలుగు, తమిళ ఇండస్ట్రీలలోనే సెటిల్ అయ్యారు. ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడారు. తాను బాలీవుడ్ ను వదిలేయడానికి కారణం.. అవ‌కాశాలు రాకపోవడం, ఇచ్చేవాళ్లు లేకపోవడమో కాదని స్పష్టం చేశారు. అప్పట్లో బాలీవుడ్ పరిశ్రమ అండర్ వరల్డ్ గ్రిప్ లో ఉండేదన్న ఆయన.. ఇది తనకు అసౌఖర్యంగా అనిపించిందని చెప్పారు. మాఫియా ఒత్తిడిని భరించకూడదని భావించి బాలీవుడ్ కు దూరంగా వచ్చేసినట్లు కమల్ స్పష్టం చేశారు.

బాలీవుడ్‌‌‌పై మాఫియా ప్రభావం!
హిందీ చిత్ర పరిశ్రమపై అండర్ వరల్డ్ ప్రభావం ఉందన్న కమల్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. 1980-90ల్లో దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ వంటి అండర్ డాన్ ల జోక్యం బాలీవుడ్ లో ఉండేదన్న ప్రచారం ఉంది. చిత్ర నిర్మాతలు, నటీనటులను బెదిరించినట్లు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే 1990లో టీ సిరీస్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ హత్య.. బాలీవుడ్ పై మాఫియా ప్రభావాన్ని బహిర్గతం చేసింది. 2000 సంవత్సరం నుంచి అండర్ వరల్ ప్రభావం ముంబయితో పాటు బాలీవుడ్ పై తగ్గుతూ వచ్చింది. పోలీసులు తీసుకున్న కఠిన చర్యల కారణంగా దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ వంటి వారు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు.

Also Read: Food Poison: ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటనలో సంచలన నిజాలు.. పెద్ద స్కామే ఇది!

హిందీలో కమల్ చేసిన చిత్రాలివే!
కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్ లో పలు చిత్రాలను కమల్ చేశారు. అలా ఆయన చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘ఏక్ దో తీన్ చార్’ (Ek Duuje Ke Liye). తమిళ చిత్రం మరో చరిత్ర (1978)కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం 1981లో విడుదలై మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత కమల్ నటించిన సాగర్ (Saagar) – 1985 , హే రామ్ (Hey Ram) – 2000, అబ్బే ఫరియా (Abhay) – 2001, ముంబై ఎక్స్‌ప్రెస్ (Mumbai Xpress) – 2005 (హిందీ డబ్), విశ్వరూపం (Vishwaroopam) – 2013 (హిందీ డబ్), విశ్వరూపం 2 (Vishwaroopam II) – 2018 (హిందీ డబ్) చిత్రాలు బాలీవుడ్ లో విడుదలయ్యాయి.

Also Read This: Tragedy News: ముగ్గురు కూతుళ్లపై తండ్రి దారుణం.. తల్లి ఏం చేసిందంటే?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్