Maoist Leader Killed: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఉదయం నుండి ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మీనరసింహ అలియాస్ సుధాకర్ (Sudhakar) మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈయన 30 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నాడు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
మూడు నెలల్లో ముగ్గురు
మూడు నెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. అయితే, వరుసగా కేంద్ర కమిటీకి చెందిన ఆగ్రనేతలే మృతి చెందడం మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలినట్లయింది. ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే తమ లక్ష్యాన్ని 2026 మార్చి 31 వరకు పూర్తి చేస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు బట్టి నిజమేనని అర్థమవుతోంది. సుధాకర్ మృతిని భద్రతా బలగాలకు సంబంధించిన ఉన్నతాధికారి ధ్రువీకరించారు.
Also Read: Gender Reveal: స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి నిర్లక్ష్యంతో.. భార్య భర్తల ఆశలు అడియాశలు!
ఇప్పటిదాకా 27 మంది హతం
ఇప్పటివరకు ఎంతమంది మృతి చెందారని విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఆరు నెలలుగా మావోయిస్టులు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. భద్రతా బలగాలను పటిష్టంగా ఎదుర్కోలేక వివిధ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటూ ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో సంచరిస్తున్నారు. గత నెలలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 27 మంది మృతి చెందగా అందులో అగ్రనేత నంబాల కేశవరావు చనిపోయాడు.
సుధాకర్ కోసం స్పెషల్ ఆపరేషన్
ప్రస్తుతం జరుగుతున్న ఎదురు కాల్పులు సుధాకర్‌ను అంతం చేయడమే ధ్యేయంగా జరిగినట్టు సమాచారం. సుధాకర్‌తో పాటు మరికొంతమంది మావోయిస్టులు మృతి చెందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆరుసార్లు మావోయిస్టులు శాంతి చర్చల కోసం విజ్ఞప్తి చేశారు. కానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించలేదు.
కొనసాగుతున్న వేట
మావోయిస్టులను పూర్తిస్థాయిలో మట్టు పెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారు. కేంద్ర కమిటీ మావోయిస్టు పార్టీలో ప్రముఖంగా పనిచేస్తున్న 18 మంది సభ్యులను మట్టు పెట్టడమే ధ్యేయంగా కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. 18 మందిలో ఇప్పటికే ముగ్గురు కీలక కేంద్ర కమిటీ నేతలు మృతి చెందారు. మిగిలిన 15 మందిని మట్టు పెట్టడమే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దించినట్లుగా సమాచారం. కేంద్ర కమిటీలో పనిచేసే 18 మంది మొదటి నుంచి మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించడం గమనార్హం.
Also Read: RCB Banned from IPL: ప్రాణాలు కంటే సంబురాలే ముఖ్యమా? ఆర్సీబీని బ్యాన్ చేయాలంటున్న నెటిజన్స్