Gandhi Bhavan: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ప్రోగ్రాంకు రూపకల్పన చేశారు. ప్రతి వారంలో రెండు రోజులు ఇద్దరు చొప్పున మంత్రులు గాంధీభవనంలో అందుబాటులో ఉండేలా షెడ్యూల్ తయారు చేశారు. రెండు నెలల వరకు బాగానే కొనసాగిన ఈ కార్యక్రమం ఆ తర్వాత క్రమంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మంత్రుల బిజీ షెడ్యూల్ వల్ల పీసీసీ కూడా ఈ ప్రోగ్రాంని నిర్వహించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో పిసిసి ఆశించిన ఫలితాలు రాలేదని అసంతృప్తి పార్టీలో ఉన్నది.
ప్రోగ్రాం రీస్టార్ట్
ఒక సందర్భంలో స్వయంగా పిసిసి కూడా ఈ ప్రోగ్రాంని పర్ఫెక్ట్ గా నిర్వహించాలని మంత్రులకు కూడా సూచించినట్టు సమాచారం. ఇక చాలా నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ ప్రోగ్రాం రీస్టార్ట్ చేసేందుకు పార్టీ షెడ్యూల్ ని రూపొందిస్తున్నది. గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పునప్రారంభం చేయనున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిరోజులుగా ఆగిపోయిన ముఖాముఖి కార్యక్రమాన్ని మళ్లీ మొదలు పెట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారుఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు గాంధీ భవన్ లోని ఇందిరా భవన్ లో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read: YSRCP: ‘వెన్నుపోటు దినం’కు అడ్డంకులు వస్తే..?
ఏ మేరకు పరిష్కారం అయ్యాయి?
పార్టీ తీసుకున్న ఈ ముఖాముఖి కార్యక్రమం వలన కార్యకర్తలకు సాధారణ ప్రజలకు ఎక్కువ లాభం జరుగుతుందని పిసిసి చీఫ్ ఆశించారు. తొలుత ఈ ప్రోగ్రాంకు అనూహ్యమైన ఆదరణ లభించింది. ప్రతిరోజు రెండు మూడు వందల మంది కార్యకర్తలు సాధారణ ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి క్యూ కట్టారు. వచ్చిన ప్రతి వ్యక్తి సమస్యను విన్న మంత్రులు ఆయా దరఖాస్తులు స్వీకరించి టిపిసిసికి అందజేశారు. కొన్ని స్పాట్లోనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సొల్యూషన్ చూపించారు. అయితే ఇప్పటివరకు జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులెన్ని? నీ సమస్యలకు పరిష్కారం లభించింది? ప్రజలు, కార్యకర్తలకు న్యాయం జరిగిందా? అనే అంశాల పట్ల ఇప్పటివరకు అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కనీసం రివ్యూ చేయకపోవడం గమనార్హం.
గాంధీ భవన్ వర్గాలే ఆఫ్ ది రికార్డులు
ముఖాముఖిలో సేకరించిన అప్లికేషన్లలో దాదాపు 90% వాటికి ఇప్పటివరకు పరిష్కారం చూపలేదని స్వయంగా గాంధీ భవన్ వర్గాలే ఆఫ్ ది రికార్డులు చెబుతున్నాయి. గతంలో సేకరించిన అప్లికేషన్లు చాలావరకు మిస్ అయి ఉంటాయని అనుమానం కూడా గాంధీభవన్ స్టాఫ్ లో ఉన్నది. ఈ ప్రోగ్రామ్ మంచి చేసేది అయినప్పటికీ, స్పష్టమైన ప్లానింగ్ లేకపోవడంతో నిర్వీర్యం అవుతున్నదని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: RCB Fan: కప్ కోసం ఎంతకు తెగించార్రా.. ఆర్‌సీబీ ఫ్యాన్ పనికి అవాక్కవాల్సిందే!