Anvesh on Bayya Sunny Yadav: ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్(భయ్యా సందీప్) (Bayya Sunny Yadav) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బైక్‌పై దేశ విదేశాలు తిరుగుతూ పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియా (Social Media) లో ఫాలోవర్స్‌ను పెంచుకుని ప్రముఖ యూట్యూబర్‌గా మారాడు. కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్‌లో ఇతను పేరు బాగా వినపడింది. అంతక ముందే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ నూతనకల్ పీఎస్‌లో ఒక కేసు నమోదైంది. టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) లో దీనికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కాస్త స్ట్రాంగ్‌గానే చెబుతూ, పోలీసులకు వివరించారు. దీంతో, నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో భయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
నా అన్వేషణ అన్వేష్ మళ్ళీ కొత్త వీడియో అప్లోడ్ చేశాడు. అతను మాట్లాడుతూ ” మన సబ్ స్కైబర్స్ భయ్యా సన్నీ యాదవ్ మీద 10 దారుణమైన అనుమానాలు ఆధారాలతో సహ పంపించారు. ఈ రెండు రోజుల్లో మన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేశారు. మొత్తం తిరిగి చాలా విషయాలు తెలుసుకున్నారు. ఎక్కదా దొరకని లాజిక్ లు మన వాళ్ళు పంపించారు. జేమ్స్ బాండ్ సినిమాకి మించిన ట్విస్ట్ లు ఈ భయ్యా సన్నీ యాదవ్ గురించి ఈ వీడియోలో ఉంది. అతను ఉగ్రవాదులతో మాట్లాడాడా? లేదా? ఉన్నది ఇక్కడ తెలుసుకుందాం..
ఫిబ్రవరి 8 న వెళ్ళి ఏప్రిల్ ఇక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు. కానీ, 8 నెలల క్రితమే పాకిస్తాన్ వెళ్ళినట్లు ఆన్లైన్ లో ఆధారాలతో సహ ఉన్నాయి.
Also Read: Manchu Manoj: ఆ స్టార్ హీరో రి రీలీజ్ మూవీ నా సినిమాని చంపేసింది.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్
ఈ వీడియో పై నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను వైజాగ్ నుంచి ఒక ఆణిముత్యం ప్రపంచ యాత్రికుడు లా మారి దేశానికి ఒక మంచి సందేశాన్నిస్తున్నారని కొందరు అంటుండగా.. అన్వేష్. నువ్వు.. భారతదేశం గర్వించదగ్గ వాడివి. ఈ సినిమా రాజకీయ నాయకులు కంటే నువ్వు 100 % బెస్ట్. నువ్వు రియల్ హీరోవి. పాకిస్తాన్ లో జకీర్ నాయక్ ని ఒక హిందువు ప్రశ్న అడగడం అంటే అసలు అవ్వదు. సన్నీ యాదవ్ అడగగలిగా డు అంటే అక్కడ ఫుల్ సపోర్ట్ ఉండే ఉంటుంది.