Comedian Ali: ఈ మధ్య కాలంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ వివాదాల్లో నిలుస్తున్న విషయం సంగతి తెలిసిందే. అయితే, తాజాగా డైరెక్టర్ ఎస్‍వీ కృష్ణారెడ్డి బర్త్డే ఈవెంట్ లో కమెడియన్ అలీపై అసభ్య పదజాలంతో పిలిచి నోరు పారేసుకున్నారు. ఇప్పటికే, దీనిపై రాజేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను.. మీరు దాన్ని కూడా తప్పుగా తీసుకుంటే ఎలా?
అయిన నేనెప్పుడూ ఇలానే సరదాగా ఉంటాను.. నా మాట తీరు కూడా అలాగే ఉంటుంది. అది కూడా మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మీ ఖర్మ అని తేల్చి చెప్పేశారు. తాజాగా ఈ వివాదం పై అలీ రియాక్ట్ అయి వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కమెడియన్ అలీ మాట్లాడుతూ ” అందరికీ నమస్కారం అండి.. నిన్న జరిగిన బర్త్ డే ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ అనుకోకుండా మాట జారారు. దీన్ని తీసుకుని మీడియా మిత్రులు రక రకాలుగా రాస్తూ వైరల్ చేస్తున్నారు. ఆయన అలాంటి వాడు కాదు. మంచి నటుడు. ఆయన గురించి మీకు కూడా తెలుసు. అలాగే ఆయన ఇంట్లో ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలిసిందే.. ఆయన పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఆయన కూతురు లేరన్న బాధలో ఉన్నారు. అమ్మ లాంటి బిడ్డ లేకపోయేసరికి మరింత క్రుంగి పోయారు. కావాలని అలా చేసింది కాదు. దీన్ని మళ్లీ వైరల్ చేయకండి. ఆయన పెద్దాయన ప్లీజ్ వదిలేయండి అంటూ ” అందర్ని రిక్వెస్ట్ చేశారు.