Madhu Yashki On Kavitha (Image Source: Twitter)
తెలంగాణ

Madhu Yashki On Kavitha: జాగృతిలో భారీ స్కామ్.. రూ.800 కోట్లు హాంఫట్.. కవితపై ఆరోపణలు!

Madhu Yashki On Kavitha: కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేత కవితపై ఘాటు విమర్శలు చేశారు. కవితను లిక్కర్ కింద్ అని సంబోదించిన ఆయన.. ఆమె బీజేపీ వదిలిన బాణమని ఆరోపించారు. లిక్కర్ కేసు నుండి బయట పడటానికి బీజేపీ సహకారం కవితకు కావాలని పేర్కొన్నారు. నిజామాబాద్ లో కవితపై జీఎస్టీ స్కామ్ (GST Scam) ఉందన్న ఆయన.. ఆమె తన అవినీతి ని కప్పి పుచ్చుకోవడానికి కొత్త నాటకానికి తెర లేపారని మండిపడ్డారు.

తెలంగాణ జాగృతిలో అవినీతి
కవితకు సంబంధించిన తెలంగాణ జాగృతిలో రూ. 800 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ముఖ్యనేత మధుయాష్కీ ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని కోరారు. జాగృతి పేరు మీద వసూళ్లు చేసిన అవినీతి సొమ్మును జాగ్రత్త చేసుకోవడానికి కవిత ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే జాగృతి బలోపేతం అంటూ కవిత మాట్లాడుతున్నారని ఆరోపించారు. కవితకు బంజారాహిల్స్ లో రూ. 2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయన్న ఆయన.. వాటితో పాటు అమెకు చెందిన విల్లాలు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

కవిత రూ.వేల కోట్లు ఎక్కడివి?
బ్యూటీ పార్లర్ నడిపే కవితకు రూ. వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని మధుయాష్కీ ప్రశ్నించారు. స్కిల్ ట్రైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం జాగృతికి ఫండ్స్ ఇస్తే కవిత కాజేశారని ఆరోపించారు. కేసీఆర్ (KCR)ను ఆమె జాతిపిత అంటున్నారని.. కానీ నిజమైన జాతిపిత జయశంకర్ అని మధుయాష్కీ అన్నారు. అయ్యప్ప సొసైటీ (Ayyappa Socity)లో ఆంధ్రోళ్ల దగ్గర డబ్బులు వసూలు చేశారని విమర్శించారు. బీజేపీ వ్యూహ రచనలో భాగంగానే కవిత తన తండ్రికి లేఖ రాశారని ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) వీక్ అయితే.. బీజేపీ స్ట్రాంగ్ అవుతుందని ప్రధాని మోదీ (PM Modi)  ప్లాన్ చేశారని ఆరోపించారు.

ఆ ఖర్మ కాంగ్రెస్‌కు పట్టలేదు
మరోవైపు కవితను కాంగ్రెస్ లో చేరుతుందన్న వ్యాఖ్యలను మధుయాష్కీ తీవ్రంగా ఖండించారు. ఆమెను పార్టీలో చేర్చుకునేంత ఖర్మ కాంగ్రెస్ (Congress) కు పట్టలేదని వ్యాఖ్యానించారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు.. ప్రధాని మోదీతో సెల్పీలు దిగుతూ తిరిగారని మండిపడ్డారు. కాశ్మీర్ లో యువతిపై అత్యాచారం జరిగితే మహిళగా ఆనాడు ఒక్క మాట మాట్లాడలేదని గుర్తుచేశారు. కవిత బీజేపీతో కలిసి కాంగ్రెస్ ను ముంచాలని చూస్తోందని అన్నారు. కవిత సారా కుంభకోణంలో కేసీఆర్, అమ్ ఆద్మీ పార్టీ భాగస్వాములని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పార్టీ ఆఫీసులో కనీసం జెండా కూడా ఎగురవేయలేదని మధుయాష్కీ విమర్శించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ లో కల్వకుంట్ల కుటుంబం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందని.. తెలంగాణ రాష్ట్రం రాకపోతే కవిత బ్యూటి పార్లర్ పెట్టుకొని బ్రతికేవారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అంటేనే బందీ పోటు దొంగల పార్టీ మధుయాష్కీ అన్నారు. తెలంగాణ రాక ముందు కేసీఆర్ ఆస్తులు ఎన్ని.. వచ్చిన తర్వాత ఎన్ని అన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విచారణకు ఆదేశించాలని మధుయాష్కి కోరారు.

Also Read: Virat Kohli: కోహ్లీకి ఊహించని షాక్.. పోలీస్ కేసు నమోదు.. మ్యాటర్ ఏంటంటే!

కేసీఆర్ లక్ష్యం అదే
తెలంగాణను దోచుకున్న రాబందుల పార్టీని వాళ్లకు వంత పాడిన అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని మధుయాష్కీ కోరారు. మరోవైపు కేటిఆర్ (KTR) కు అమెరికా (America), దుబాయ్ (Dubai) లో పెట్టుబడులు ఉన్నాయన్న మధుయాష్కి.. ఇన్వెస్ట్ మెంట్ చేయడానికే ఆయన అమెరికా వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్ జీవిత లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధన కాదని.. ముఖ్యమంత్రి కావడమేనని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కుటుంబంతో సోనియా గాంధీ (Sonia Gandhi) కాళ్లను కేసీఆర్ మొక్కారని గుర్తుచేశారు. తాను సీఎం కావాలనే జీవిత లక్ష్యం నెరవేరిందని.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

Also Read This: Glenn Maxwell: సంచలన నిర్ణయం తీసుకున్న గ్లెన్ మాక్స్‌వెల్.. వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఆల్‌రౌండ‌ర్‌

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు