Manchu Manoj: నాదొక విన్నపం మనకి ఇప్పుడు ఐపీఎల్ ఉంది.. దాని వలన సినిమా ఎఫెక్ట్ అయి ఉంది. అలాగే థియేటర్స్ , ఓటీటీ అది కూడా వచ్చింది. మనకీ ఓటీటీ ఉంటూనే థియేటర్స్ లో సినిమాలు నడుస్తున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే, సినిమా అంత గొప్పది కాబట్టి. ఇక పండుగలు, ముఖ్యమైన డేట్స్ అన్ని పెద్ద సినిమాలు ముందు గానే బ్లాక్ చేసుకుని పెట్టుకుంటాయి. అదంతా మీకు తెలిసిందే. కాకపోతే కొన్ని సమయాల్లో మనం చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేయాలి.
Also Read: Nani Transgender Role: నాని ఆ సినిమాలో ట్రాన్స్ జెండర్ గా కనిపించబోతున్నాడా.. షాక్ లో ఫ్యాన్స్
నా టీం దగ్గర నుంచి కానీ, నా సొంతంగా నేనేం ఫీల్ అయ్యాను అంటే.. రి రిలీజ్ సినిమాలు వీకెండ్ అవైడ్ చేసి, వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే..అది మంచి ఇడియా. ఎందుకంటే, ఆ సినిమా ఒకసారి రిలీజ్ రిలీజ్ అయింది కాబట్టి ఎప్పుడూ విడుదల చేసిన కలెక్షన్స్ వస్తాయి. మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం అనేది బాగలేదు. అంటే దీని వలన ఒక ఎఫెక్ట్ రావడం అనేది మంచిగా లేదు. అందరూ అడగొచ్చు.. వీకెండ్స్ లోనే ఎక్కువ టైమ్ దొరుకుతుంది. పెద్ద వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. అన్ని పండగలు, అన్ని డేట్స్ తీసేసుకుంటున్నారు కాబట్టి. దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ మంచు మనోజ్ తన మాటల్లో చెప్పుకొచ్చాడు.
Also Read: Kabaddi Association: కబడ్డీ అసోసియేషన్‌లో కుంభకోణం.. సంచలన విషయాలు వెలుగులోకి!