Super Star Krishna: లెజండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా, ఆయన అల్లుడు.. నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తున్న ‘జటాధర’ (Jatadhara) మూవీ టీమ్ ఘనంగా నివాళులు అర్పించింది. తెలుగు సినిమా చరిత్రలో నటశేఖరుడు కృష్ణ ప్రస్థానం గురించి తెలియంది కాదు. తెలుగు సినిమాకు కొత్త ఒరవడిని నేర్పింది, తెలుగు సినిమాను రూపురేఖలను మార్చింది ఈ సూపర్ స్టారే. ఇది అందరికీ తెలిసిందే. అలాంటి తిరుగులేని చరిష్మా, లార్జర్ దెన్ లైఫ్ స్క్రీన్ ప్రెజన్స్ ఉన్న సూపర్ స్టార్.. మాకు స్ఫూర్తి అంటూ టీమ్ అద్భుతమైన పోస్టర్‌ని విడుదల చేసింది.
Also Read- Manchu Manoj: డీఎన్ఏ లోనే ఉంది.. నాన్న దగ్గర నుంచి వచ్చిన గొప్ప ఆస్తి అది!
నిజంగా ఈ పోస్టర్ నటశేఖర కృష్ణ (Natasekhara Krishna)కు పర్ఫెక్ట్ ట్రెబ్యూట్ అనేలా ఉంది. కృష్ణను ఈ టీమ్ ఎలా చూస్తుందో.. ఈ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తెలుగు వెండితెర దేవుడిగా భావిస్తూ.. సూపర్ కృష్ణను టీమ్ తమ సినిమా టైటిల్‌కు తగినట్లుగా శివుని అవతారంలో చూపించారు. హీరో సుధీర్ బాబు.. శివుని అవతారంలో ఉన్న కృష్ణ (Krishna) ఆశీస్సులు తీసుకుంటున్నట్లుగా క్రియేటివ్‌గా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌ని షేర్ చేసిన టీమ్.. ప్రపంచ సినిమాపై ప్రభావాన్ని చూపిన శక్తి, లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ మాకు మార్గదర్శకం అని పేర్కొన్నారు. ‘హ్యాపీ బర్త్‌డే టు ద కింగ్ ఆఫ్ చరిష్మా’ అంటూ సినీ పరిశ్రమపై ఈ లెజండ్రీ నటుడి చిరస్మరణీయ ప్రభావాన్ని శ్లాఘించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతూ.. ఘట్టమనేని అభిమానులను మైమరపిస్తోంది. నిజంగా, అల్లుడు సుధీర్ బాబు నుంచి ఇది ఊహించలేదంటూ.. నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Also Read- Actress Kalpika: బర్త్‌డే కేక్.. పబ్‌లో టాలీవుడ్ నటి కల్పికపై దాడి
‘జటాధర’ సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఓ కీలక పాత్రలో నటిస్తోన్న మొదటి డైరెక్ట్ తెలుగు చిత్రమిది. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెలుగు, హిందీ భాషల్లో మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. అక్షయ్ క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలు. దివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భవానీ గోస్వామి సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. అభిమానులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు