Celebrities Reaction on Gaddar Film Awards
ఎంటర్‌టైన్మెంట్

Gaddar Film Awards: బాలయ్య, మహేష్, సుకుమార్‌ల స్పందన చూశారా!

Gaddar Film Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ ల గుడ్ న్యూస్‌లు చెబుతోంది. ముందుగా 2024 సంవత్సరానికి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ని ప్రకటించి అందరినీ సంతోష పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. నంది అవార్డ్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో.. అప్పటి నుంచి లెక్క పెట్టి ప్రతి సంవత్సరం ఉత్తమ చిత్రాలుగా మూడేసి సినిమాలకు అవార్డులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం 2024 నుంచి కంటిన్యూ చేస్తూ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడైతే ఈ అవార్డులు ఆగిపోయాయో.. అక్కడి నుంచి ఇవ్వడం నిజంగా ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని.. సినీ పెద్దలందరూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read- Kannappa Hard Disk: మనోజ్ ఇంట్లో పనిచేసే వారి పనే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

అవార్డులకు ఎంపికైన వారంతా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తాజాగా ఈ అవార్డులపై నందమూరి నటసింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకుగానూ తనని ఎంపిక చేయడం పట్ల బాలయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘నాన్న శ‌తజ‌యంతి ఉత్స‌వాలు పూర్తిచేసుకున్న అద్భుత‌మైన ఘ‌డియ‌లు ఒక వైపు, ఆయన నట ప్రస్థానం 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు, నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకో వైపుతో అంతా సంతోషంగా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్‌తో సత్కరించిన ఇలాంటి త‌రుణంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ని నాకు ప్ర‌క‌టించ‌డం నా అదృష్టంగా, ఆ దైవ నిర్ణ‌యంగా, నాన్న ఆశీర్వాదంగా భావిస్తున్నాను. అలాగే, ప్ర‌పంచ న‌లుమూల‌లా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల దీవెన‌లు, నాన్న చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్ల‌వేళలా ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారానికి న‌న్ను ఎంపిక చేసిన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కమిటీ జ్యూరీ స‌భ్యుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను’’ అని బాలయ్య స్పందించారు.

Also Read- Naa Anveshana: ఆ ప్రశ్న ఒక్కటి చాలు.. భయ్యా సన్నీ యాదవ్ బొక్కలన్నీ బయటపడతాయ్!

‘శ్రీమంతుడు, మహర్షి, మేజర్ (నిర్మాత) చిత్రాలకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందించటంతో పాటు, సినీ పండగకు కారణమైన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గౌరవానికి కారణమైన నా దర్శకులతో పాటు చిత్రాలకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నా:
తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ప్రకటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నన్ను ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గద్దర్ ఫిల్మ్ అవార్డు జ్యూరీకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు సినిమా రంగంలో శిఖరం వంటి బీఎన్‌ రెడ్డి పేరు మీద ఉన్న అవార్డు అందుకోవడం మరింత గౌరవంగా అనిపిస్తుంది. నా చిత్రాల నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, నా చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని బ్రిలియంట్ దర్శకుడు ఓ మెసేజ్‌ని విడుదల చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు