Vishnu Manchu
ఎంటర్‌టైన్మెంట్

Kannappa Hard Disk: మనోజ్ ఇంట్లో పనిచేసే వారి పనే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

Kannappa Hard Disk: రీసెంట్‌గా ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి ఓ హార్డ్ డిస్క్ మిస్ అయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై చిత్ర హీరో మంచు విష్ణు స్పందించారు. అసలు ఆ హార్డ్ డిస్క్‌లో ఏముందో, ప్రస్తుతం ఎవరి చేతుల్లో అది ఉందో కూడా ఆయన చెప్పేశారు. తాజాగా మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్లలో భాగంగా అటెండ్ అయిన ఓ ఇంటర్వ్యూలో ‘కన్నప్ప’కు సంబంధించి మిస్ అయిన హార్డ్ డిస్క్ ప్రస్తావన వచ్చింది. దీనిపై ఆయన మాట్లాడుతూ..

‘‘ఫ్యామిలీ విషయాలు ఇక్కడ అడగవద్దు. శ్రీరామచంద్రుని ఇంట్లోనే ఎన్నో సమస్యలు ఉంటాయి. మా ఇంట్లోనే కాదు, అందరి ఇళ్లలోనూ సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇక్కడ ఆ సమస్యల గురించి, ఫ్యామిలీల గురించి కాకుండా ఏదైనా ‘కన్నప్ప’ సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుందాం. హార్డ్ డిస్క్ మిస్ అయింది నిజమే. అందులో ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన విఎఫ్‌వర్క్ డేటా ఉంది. అయితే సేఫ్ వెర్షన్ ఎప్పుడూ ఉంటుంది. ‘కన్నప్ప’ విషయానికి వస్తే.. సినిమా డిజిటల్ వెర్షన్‌కు సంబంధించి హాలీవుడ్‌లో మూడు కాపీలు, హైదరాబాద్‌లో రెండు కాపీలో స్టోర్ చేసి ఉంచాం. ‘కన్నప్ప’ సీజీ వర్క్‌ని ఇండియాలో 8 కంపెనీలకు ఇచ్చాం. విదేశాల్లో రెండు కంపెనీలు పని చేస్తున్నాయి. ముంబైకి సంబంధించిన ఓ సంస్థ కలర్ గ్రేడింగ్ వర్క్‌ని చూస్తుంది. అక్కడ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ కాస్త ఇబ్బంది ఎదురవడంతో.. ఆ కంపెనీ కొంత డేటాని హార్డ్ డిస్క్‌లో పెట్టి కొరియర్ చేసింది. ఆ కంపెనీపై మాకు ఎటువంటి అనుమానాలు లేవు. నాకు చాలా నమ్మకం ఉంది. కానీ ఆ కొరియర్ మాత్రం మాకు రాలేదు.

Also Read- Naa Anveshana: ఆ ప్రశ్న ఒక్కటి చాలు.. భయ్యా సన్నీ యాదవ్ బొక్కలన్నీ బయటపడతాయ్!

మేము ఇలాంటి కొరియర్స్ కోసం రెండు అడ్రస్‌‌లను వాడతాం. అందులో ఒకటి ఆఫీస్ అడ్రస్ అయితే, జీఎస్టీ రిజస్టర్ అడ్రస్‌గా ఫిల్మ్ నగర్‌లోని ఇంటి అడ్రస్‌ని ఇచ్చాం. నాన్నతో పాటు మా ముగ్గురికి సంబంధించి ఎటువంటి కొరియర్స్ వచ్చినా, అక్కడి మేనేజర్లు వెంటనే ఎవరిది వారికి పంపిస్తారు. దాదాపు 15 సంవత్సరాలుగా ఇది జరుగుతూ వస్తుంది. కానీ ప్రస్తుతం మా ఇంట్లో పరిస్థితులేం బాగా లేవు. ఆ విషయం అందరికీ తెలుసు. మా కంపెనీ పేరు మీద వచ్చిన కొరియర్‌ని అందుకు రఘు అనే అతను, వెంటనే ఆ ప్యాకెట్‌ని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. వాళ్లిద్దరూ మనోజ్ ఇంట్లో పని చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. మనోజ్ చెబితే వచ్చి వీళ్లు తీసుకున్నారా? లేదంటే వాళ్లే కావాలని తీసుకున్నారా? అనేది కూడా నాకు తెలియదు. దీనిపై మేము కంప్లెయింట్ కూడా ఇవ్వాలని అనుకోలేదు. నాన్నకు విషయం చెబితే ఎంతగానో బాధపడ్డారు.

Also Read- Venky vs Nag: వెంకీ, నాగ్ ఫ్యాన్స్ మధ్య వార్.. అస్సలు ఊహించలేదు కదా!

ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చూసి పోలీసులను సంప్రదించాను. వాళ్లు కేసు పెట్టండి.. మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారు. ఇక తప్పక కేసు పెట్టాల్సి వచ్చింది. ఈ హార్డ్ డ్రైవ్‌లో దాదాపు 70 నిమిషాల ఫుటేజ్ ఉంది. దాని కోసం నాలుగు కంపెనీలు పని చేశాయి. అందులోని కంటెంట్ లీక్ అవుతుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే, హార్డ్ డిస్క్‌కు పాస్ వర్డ్ ప్రొటక్షన్ ఉంది. దానిని ఓపెన్ చేయడం అంత ఈజీ కాదని అనుకుంటున్నాము. ఒకవేళ లీకైతే మాత్రం, దయచేసి ఆ లీకైన సన్నివేశాలను చూడొద్దని వేడుకుంటున్నాను. దీని వెనుక ఎంతో మంది కష్టం ఉంది. జూన్ 27న మంచి క్వాలిటీతో సినిమా థియేటర్లలోకి వస్తుంది. థియేటర్లకు వచ్చి, ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’’ అని విష్ణు చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?