MP Raghunandan Rao: తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాల గురించి బీజేపీ (BJP) ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం (Hyd BJP Office) లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా పుంజుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందన్న మెదక్ ఎంపీ (Medak MP).. అటు బీఆర్ఎస్ (BRS) పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదని విమర్శించారు. పార్లమెంటులో ఆ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని ప్రజలు భావిస్తున్నట్లు ఆరోపించారు.
వారిపై కేసులు పెట్టాలి
బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) ఒక్కటే అన్న కాంగ్రెస్ (Congress) ప్రచారాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. తనపై కూడా వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెల్లె కవితమ్మ (Kalvakuntla Kavitha) చెప్పినట్లు తనపై కూడా పెయిడ్ ఆర్టికల్స్ రాపిస్తున్నారని మండిపడ్డారు. పెయిడ్ ఆర్టిస్ట్స్ ని గుర్తించి వారిపై కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి సూచించారు. తద్వారా వారిని రిమాండ్ కు తరలించాలని కోరారు.
చచ్చిన పార్టీకి బ్రాండింగ్
తెలంగాణలో కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao), కవిత చెల్లని రూపాయలుగా మారిపోయారని రఘునందన్ రావు ఆరోపించారు. పదేళ్ల పాలనలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి (Kasoju Srikanth Chary) కుటుంబానికీ ఎలాంటి ప్రాతినిథ్యం దక్క లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన 12వందల అమరులను అప్పట్లో కేసీఆర్ గవర్నమెంట్ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family) రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుందని ఆరోపించారు. చచ్చిన పార్టీకి ప్రాణం పోసేందుకు కేటీఆర్, కవిత బ్రాండింగ్ చేసుకుంటున్నారని విమర్శించారు.
బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే
మరోవైపు కవితపైనా రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు. పదేళ్లలో ఏ ఒక్క అమరుల ఇంటికి కవిత వెళ్లిందా? అని ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు చర్చలు జరిగాయనీ ఒకసారీ.. కేసీఆరే మా నాయకుడని మరోసారి.. రెండు విధాలుగా ఆమె స్టేట్ మెంట్లు ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ చెత్త పంచాయతీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజల మనస్సు గెలిచింది.. పైసలు పంచి కాదని స్పష్టం చేశారు.
కవిత.. మీడియా మందుకు రావాలి
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కవిత చిట్ చాట్ లు కాకుండా ధైర్యం ఉంటే మీడియా ముందుకు రావాలని సూచించారు. కుటుంబ పంచాయతీని మీరు మీరు తేల్చుకోవాలి తప్పితే బీజేపీని వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. హరీష్ రావు బీజేపీ కోవర్టు అయితే అప్పట్లో మంత్రి వర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు.
Also Read: Swiss Glacier Collapse: ప్రకృతి ప్రకోపం.. పూర్తిగా నాశమైన గ్రామం.. ఇది ప్రళయమే!
బీజేపీలో కోవర్టులు లేరు
జనం గుండెల్లో బీఆర్ఎస్ కు స్థానం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జాగ కోసం ప్రస్తుతం వారు కొట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బలహీనపడాలి అనుకునేవాల్లే కవిత వెనక ఉన్నారని విమర్శించారు. కవిత పార్టీ పెడుతుందని నాకు సమాచారం ఉందని మరోమారు స్ఫష్టం చేశారు. బీఆర్ఎస్ కు అభ్యర్ధులు లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) పోటీ చేయలేదని అన్నారు. కోవర్టు పని చేసే వాళ్లు బీజేపీలో ఉండరని.. పక్క రాష్ట్రంలో ఉన్న పంచాయతే ఇక్కడ వచ్చిందని రఘునందన్ రావు అన్నారు.