Gaddar Awards 2014 to 2023: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అందిస్తున్న గద్దర్ అవార్డులను ప్రముఖ నటుడు మురళి మోహన్ (Murali Mohan) ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని అనౌన్స్ చేశారు. 2014లో ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్ నిలిచింది. 2015కి గాను రుద్రమదేవి, 2016కి గాను శతమానం భవతి, 2017కి గాను బాహుబలి: కంక్లూజన్, 2018కి గాను మహానటి, 2019 మహర్షి, 2020 అలా వైకుంఠపురం, 2021 ఆర్‌ఆర్‌ఆర్, 2022 సీతారామం. 2023కి గాను బలగంను ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేశారు. అంతేకాదు ఆయా సంవత్సరాలకు సంబంధించి ద్వితియ, తృతీయ స్థానంలో నిలిచిన చిత్రాలను సైతం కమిటీ ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉత్తమ చిత్రాల లిస్ట్ ఇదే
2014 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్
❄️ రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల
❄️ మూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శ్రీను
2015 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
❄️ రెండో ఉత్తమ చిత్రం: కంచె
❄️ మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు
2016 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: శతమానం భవతి
❄️ రెండో ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
❄️ మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్
2017 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: బాహుబలి 2
❄️ రెండో ఉత్తమ చిత్రం: ఫిదా
❄️ మూడో ఉత్తమ చిత్రం: ఘాజి
2018 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: మహానటి
❄️ రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం
❄️ మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం
2019 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: మహర్షి
❄️ రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ
❄️ మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం
2020 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో
❄️ రెండో ఉత్తమ చిత్రం: కలర్ ఫొటో
❄️ మూడో చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్
2021 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్
❄️ రెండో ఉత్తమ చిత్రం: అఖండ
❄️ మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన
2022 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: సీతారామం
❄️ రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
❄️ మూడో ఉత్తమ చిత్రం: మేజర్
2023 ఏడాదిలో
❄️ ఉత్తమ చిత్రం: బలగం
❄️ రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్
❄️ మూడో ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
స్పెషల్ జ్యూరీ అవార్డులు
❄️ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ : నందమూరి బాలకృష్ణ
❄️ పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డ్ : మణిరత్నం
❄️ బీఎన్ రెడ్డి అవార్డు: దర్శకుడు సుకుమార్
❄️ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు
❄️ కాంతారావు అవార్డు: విజయ్ దేవరకొండ
❄️ రఘుపతి వెంకయ్య అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్