Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja)కు అర్జెంట్‌గా ఓ హిట్టు బొమ్మ పడాలి. ఆయన మాత్రం హిట్టు, ఫ్లాప్ అనేది చూడకుండా వరసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే మ్యాగ్జిమమ్ హిట్ అనేలా ప్రమోషన్స్ ఉంటున్నాయి కానీ, సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ఆ సినిమాలు తేలిపోతున్నాయి. ఇలా వరుస పరాజయాలు ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే ఓ మాంచి హిట్‌తో మాస్ రాజా కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది కూడా ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’తో వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ‘మాస్ జాతర’ సినిమాను భాను భోగవరపు దర్శకత్వంలో.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. తాజాగా నిర్మాతలు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
Also Read- Megastar Chiranjeevi: ‘గద్దర్ అవార్డ్స్’.. ఎవరి పేరు మెన్షన్ చేయాలో చిరుకి తెలియదా?
‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హింట్ ఇచ్చేసింది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకువచ్చేలా, ప్రచార చిత్రాలతోనే ఈ చిత్రం ఏ స్థాయి వినోదాన్ని అందించబోతుందో అందరికీ అర్థమైంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘తు మేరా లవర్’ అందరినీ ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ పాటకు ట్రిబ్యూట్‌గా మలిచిన ‘తు మేరా లవర్’ గీతం అభిమానులకు విందు భోజనంలా రెడీ చేశారు.
Eesari Ganesh Utsavam theatres lo jarupukundham 🤗#MassJathara AUGUST 27th ❤️#MassJatharaOnAug27th pic.twitter.com/TBQEXSAkbS
— Ravi Teja (@RaviTeja_offl) May 29, 2025
Also Read- Gaddar Film Awards 2024: గద్దర్ అవార్డ్స్ ప్రకటనతో.. ఓటీటీ సంస్థ సంబరాలు చేసుకుంటోంది
రవితేజ సరసన ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ధమాకా’తో ఈ జోడి ఎలాంటి సక్సెస్‌ని అందుకుందో తెలియంది కాదు. మళ్లీ ఈ జంట తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో సంచలనాన్ని క్రియేట్ చేసిన సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ‘మాస్ జాతర’తో మరోసారి తన సత్తా చాటబోతున్నారు. ‘ధమాకా’తోనే ఓ ఊపు ఊపిన భీమ్స్.. ఇప్పుడు ‘మాస్ జాతర’తో మరోసారి మాస్ ప్రేక్షకులకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఈ వినాయక చవితికి ‘మాస్ జాతర’ చిత్రంతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకొచ్చి, అభిమానుల దాహాన్ని తీర్చడానికి దర్శకుడు భాను బోగవరపు తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా నిర్మాతలు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు