Singareni ( Image Source: Twitter)
తెలంగాణ

Singareni: సింగరేణి వైద్య విభాగానికి ఏటా రూ.400 కోట్లు.. వారికి సీఎండీ వార్నింగ్

Singareni: సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం యాజమాన్యం ఏటా రూ.400 కోట్లు వెచ్చిస్తోందని, ఆసుపత్రులను ఆధునికీకరిస్తోందని తెలిపారు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ (Balaram Naik) తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రుల ప్రధాన వైద్యాధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ (Hyderabad) లోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణిలో పనిచేస్తున్న వైద్యులంతా పూర్తి అంకితభావంతో పనిచేయాలని, కార్మికుల నమ్మకాన్ని గెలచుకోవాలని సూచించారు. పని విషయంలో రాజీ పడొద్దని అంతా తాము చూసుకుంటామని స్పష్టం చేశారు.

నిధుల మంజూరుకు సిద్ధం

గతంలో వైద్య సేవలకు నిధుల మంజూరులో అనేక ఆటంకాలు ఉండేవని, కానీ ఇప్పుడు ఎలాంటి కోతలు, తగ్గింపులు లేకుండా నిధులు మంజూరు చేయటానికి యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించడం కోసం ఖర్చుకు వెనుకాడకుండా అన్ని రకాల వైద్య పరీక్షల యంత్రాలు, ఔషధాలు సమకూర్చటానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉందని ఇప్పటికే పలుమార్లు చెప్పానని గుర్తు చేశారు. అయినా కొన్ని ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రతిపాదనలు పంపడంలో ఎందుకు శ్రద్ధ వహించడం లేదని సింగరేణి వైద్యశాఖపై బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలా జరగకూడదని స్పష్టం చేశారు.

Read Also- Corporators: ఆగని కార్పొరేటర్ల ఆగడాలు.. భార్యల పదవులతో రెచ్చిపోతున్న భర్తలు!

ప్రతిపాదనలు పంపండి

ఏరియా ఆస్పత్రుల యాజమాన్యాలు తక్షణమే వారికి కావాల్సిన కనీస వైద్య పరికరాలు, అవసరమైన మందుల ప్రతిపాదనలు పంపించాలని, తన తదుపరి తనిఖీల్లో ఏ ఒక్క పరికరం లేదనే మాట రాకూడదని హెచ్చరించారు. వార్షిక ప్రణాళికతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ఏయే పరికరాలు కావాలన్నది నిర్ధారించుకొని ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఇప్పటికే ఏరియా ఆస్పత్రులకు వైద్యుల్ని కేటాయించామని, ఇంకా అవసరమైన వైద్యుల్ని, టెక్నీషియన్లను సమకూర్చేందుకు యాజమాన్యం సంసిద్ధంగా ఉందన్నారు.

ప్రతీ దానికి హైదరాబాద్ ఎందుకు?

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందించే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా వెంటనే హైదరాబాద్ దవాఖానకు రిఫర్ చేస్తున్నారని, తద్వారా మూడేళ్లలో రూ.30 కోట్లుగా ఉన్న రిఫరల్ బిల్లులు ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందని వివరించారు. కంపెనీ డాక్టర్లు తమ సమర్థతను, నైపుణ్యాన్ని చూపించకుండా ప్రతి చిన్న కేసును రిఫర్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఎద్దేవాచేశారు. ఇదిలా ఉండగా కోవిడ్ వ్యాప్తి జరిగినట్లయితే దానిని ఎదుర్కొనేందుకు అన్ని ఏరియా ఆస్పత్రుల్లో తగిన విధంగా సంసిద్ధమై ఉండాలని సూచించారు. ఈ రివ్యూలో సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణ రావు, ఎల్వీ సూర్యనారాయణ రావు, వెంకటేశ్వర్లు, సుభానీ, రాజశేఖరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్, అన్ని ఏరియా ఆసుపత్రుల ముఖ్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also- Eatala Rajendar: బీజేపీ స్ట్రీట్ ఫైట్ చేయదు.. కవితకు ఈటల కౌంటర్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!