Meenakshi Natrajan9image credit: twitter)
తెలంగాణ

Meenakshi Natrajan: మీనాక్షి మార్క్ మొదలు.. ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్!

Meenakshi Natrajan: ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ మార్క్ మొదలైనది. గత రెండు రోజులుగా వరుసగా రివ్యూలు చేస్తూ పార్టీ పరిస్థితులపై స్టడీ చేస్తున్నారు. అయితే తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలకు మీనాక్షి సున్నితంగా క్లాస్ పీకినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రతిపక్షాలు అవలంభించే ఎత్తుగడలను ముందే ఎందుకు పసిగట్టడం లేదని ఫైర్ అయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాల కదలికలను తెలుసుకొని, ప్రభుత్వం, పార్టీపై బురద జల్లే ప్రాసెస్ కు చెక్ పెట్టడంలో ఫెయిలయ్యారంటూ మీనాక్షి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిసింది.

ప్రతిపక్షాల ప్లాన్ లను ముందుగానే అంచనా వేసి గుర్తిస్తే, ఆ స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు వచ్చి ఉండేవి కాదని ఆమె నొక్కి చెప్పారు. ఇప్పటికైనా యాక్టివ్ కావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ, ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడే ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రాలు లభించవని, లేకుంటే బురద జల్లే ప్రక్రియ స్పీడప్ అవుతుందని వెల్లడించారు. పార్టీ పై డ్యామేజ్ జరగకుండా ఉండాలనే ఎమ్మెల్యేలు పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. పదేళ్ల పవర్ కోసం ఎమ్మెల్యేలు నిర్వీరామంగా పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తల లిస్టును మీనాక్​షి కోరారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయా లీడర్లు, కార్యకర్తలకు అవకాశం కల్పించనున్నట్లు మీనాక్షి వెల్లడించారు.

Also Read: Plots Fraud: ప్లాట్ కొనుగోలు పేరుతో మోసం.. 28.20 లక్షల నగదు దోచిన ముగ్గురు అరెస్ట్!

జూన్ 5 వరకు ఇక్కడే…
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ వచ్చే నెల 5 వరకు హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ కు వచ్చిన మరుక్షణమే ఆమె పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా రివ్యూలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, పోటీ చేసిన లీడర్లతో ఆమె సమీక్షించారు. గురువారం చేవెళ్ల, మహబూబ్ నగర్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ నేతలతో రివ్యూ చేశారు. పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడాల్సిందేనని నొక్కి చెప్పారు. వీలైనన్నీ ఎక్కువ సీట్లు సాధించి పార్టీకి మరింత మైలేజ్ ను తీసుకురావాలని మీనాక్షి ఎమ్మెల్యేలకు టాస్క్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేల వారీగా తను ఎప్పటికప్పుడు పనితీరు రిపోర్టును తయారు చేస్తామని చెప్పారు.

ఏ పార్టీ ప్రభావం ఉంటుంది..??
క్షేత్రస్థాయిలో ఏ పార్టీ తో పోటీపడాల్సి ఉంటుంది? బీజేపీ, బీఆర్ ఎస్ బలబలాలు ఎంత..? గ్రౌండ్ కేడర్ ఎక్కువగా ఏ పార్టీకి ఉన్నారు? వాళ్లను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ఏం చేయాలి? అనే తదితర అంశాలపై మీనాక్షి ఆరా తీశారు. ఒక్కో ఎమ్మెల్యే వివరించిన ప్రతీ పాయింట్ ను మీనాక్షి మినిట్స్ రూపంలో నమోదు చేసుకున్నట్లు తెలిసింది. జూన్ 5 వరకు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కంప్లీట్ పిక్చర్ ను రూపొందించనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ కి వివరించనున్నారు. కార్యవర్గం, మంత్రి వర్గ విస్తరణ పై కూడా మీనాక్షి వ్యక్తిగత అభిప్రాయాలను సేకరించారు. త్వరలో క్షేత్రస్థాయి లీడర్లు, జిల్లా స్థాయి కేడర్ తోనూ మీనాక్షి రివ్యూలు నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్లు తెలిసింది.

Also Read: Gang Arrested: అంతర్​ రాష్ట్ర గ్యాంగ్​ అరెస్ట్.. 5 తపంచాలు…18 బుల్లెట్లు స్వాధీనం!

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?