BJP on Allu Arjun Award (Image Source: Twitter)
తెలంగాణ

BJP on Allu Arjun Award: గద్దర్ అవార్డులపై రాజకీయ రగడ.. కాంగ్రెస్‌ను ఏకిపారేస్తున్న బీజేపీ!

BJP on Allu Arjun Award: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ వాటిని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆమె.. వివిధ క్యాటగిరీల్లో అవార్డు పొందిన నటీనటులు, సినిమాలను ప్రకటించారు. ఈ క్రమంలో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ను ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. పుష్ప చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా అతడు ఎంపికైనట్లు వెల్లడించింది. అయితే ఈ అంశమే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీపై విపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

స్మగ్లర్ పాత్రపై విమర్శలు
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. అదే సమయంలో ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన స్మగ్లర్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం.. ప్రస్తుత కాలంలో స్మగ్లర్లు హీరోలుగా మారిపోయారంటూ పరోక్షంగా చురకలు అంటించారు. తెలంగాణ మంత్రి సీతక్క సైతం గతంలో పుష్ప 2 లోని అల్లు అర్జున్ పాత్రపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సీతక్క ఏమన్నారంటే?
తెలంగాణ మంత్రి సీతక్క గతేడాడి డిసెంబర్ లో మాట్లాడుతూ పుష్ప 2 చిత్రంపై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో స్మగ్లర్ గా చేసి అల్లు అర్జున్ ను హీరో చేశారని.. పోలీసులను విలన్ గా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ పోలీసుల బట్టలు విప్పించి.. నిలబడితే ఆ హీరోకు జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం ఏంటని కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని మండిపడ్డారు. మహారాష్ట్రలో రెండు హత్యలు చేసిన హంతకుడు పుష్ప 2 సినిమా చూస్తూ దొరగాడంటూ అప్పట్లో మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు.

నెట్టింట ఏకిపారేస్తున్న బీజేపీ
గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ను ఎంపిక చేయడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. గతంలో మంత్రి సీతక్క చేసిన కామెంట్స్ ను అస్త్రంగా మార్చుకొని అధికార కాంగ్రెస్ ను ఏకిపారేసింది. కల్పిత పాత్రలు ఉన్న సినిమాలోని పోలీసు క్యారెక్టర్ ను అవమానించారని.. ఆ సినిమాకు అవార్డు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు అన్నారని బీజేపీ తన ఎక్స్ లో పోస్టు చేసింది. ఇప్పుడు అదే సినిమా హీరోకి ఉత్తమ నటుడు అవార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు.

గద్దర్ పేరు పెట్టడంపైనా ప్రశ్నలు
పోలీసులపై అంత ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. అదే పోలీసుల ఊచకోతకు కారణమైన గద్దర్ పేరును ఉత్తమ అవార్డులకు పెట్టడం ఏంటని బీజేపీ ప్రశ్నించింది. అమాయక ప్రజలు, పోలీసుల ప్రాణాలను కబళించే నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తుంటే కాంగ్రెస్ నాయకులే అడ్డుపడుతున్నారని ఆరోపించింది. కల్పిత పాత్ర అయినా సినిమాలో పోలీసును అవమానించడాన్ని తట్టుకోలేని మంత్రి సీతక్క.. నిజ జీవితంలో పోలీసులను ఊచకోత కోసిన నక్సలైట్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని ఎక్స్ లో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ కపట బుద్ధి చూసి ఊసరవెల్లి కూడా ఊరెసుకుంటుందని విమర్శించింది.

అప్పట్లో సీఎం సైతం విమర్శలు
పుష్ప 2 తొక్కిసలాట సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం మూవీ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ థియేటర్ కు రావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీ సాక్షిగా బన్నీ చేసిన తప్పులను రేవంత్ ఎత్తి చూపారు. అటువంటిది గద్దర్ అవార్డుల సందర్భంగా పుష్ప 2 చిత్రానికే ఉత్తమ నటుడి అవార్డ్ ఇవ్వడంపై నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు