Gaddar film Awards (image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Gaddar film Awards: గద్దర్ అవార్డులు.. బెస్ట్ యాక్టర్‌గా బన్నీ.. మిగతా విజేతలు వీరే!

Gaddar film Awards: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ప్రకటించింది. జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ వాటిని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆమె.. వివిధ క్యాటగిరీల్లో అవార్డు పొందిన నటీనటులు, సినిమాలను ప్రకటించారు. గద్దర అవార్డు కోసం మెుత్తం 1248 నామినేషన్లు వచ్చినట్లు నటి జయసుధ తెలిపారు. వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు.

14 ఏళ్ల తర్వాత ప్రకటన
గతంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించడం గమనార్హం. మెుత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు సినిమాలతో పాటు ఉర్దూ మూవీస్ సైతం గద్దర్ అవార్డుల్లో ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు ఇలా 21 మందికి అవార్డులను ప్రకటించారు. అవార్డుకు ఎంపికైన నటులు, చిత్రాలు లిస్ట్ ఈ విధంగా ఉంది.

ఉత్తమ చిత్రాల జాబితా
❄️ మెుదటి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ – కల్కి 2898 ఏడీ
❄️ రెండో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ – పొట్టెల్
❄️ మూడో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ – లక్కీ భాస్కర్
❄️ ఉత్తమ బాలల చిత్రం – 35 ఇది చిన్న కథ కాదు
❄️ చారిత్రక విభాగంలో ఫీచర్‌ హెరిటేజ్‌ చిత్రం- రజాకార్‌
❄️ ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఐ అండ్‌ మై ఫ్రెండ్స్‌
❄️ ఉత్తమ కామెడీ చిత్రం : ఆయ్‌
❄️ బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్: యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)

వ్యక్తిగత విభాగాల్లో పురస్కారాలు
❄️ ఉత్తమ దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌ (కల్కి)
❄️ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప 2)
❄️ ఉత్తమ నటి: నివేదా థామస్‌ (35 ఇది చిన్న కథ కాదు)
❄️ బెస్ట్ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
❄️ బెస్ట్ సహాయ నటి: శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)
❄️ బెస్ట్ సంగీత దర్శకుడు: బీమ్స్‌ (రజాకార్‌)
❄️ బెస్ట్ నేపథ్య గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌ (ఊరి పేరు భైరవకోన)
❄️ ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (పుష్ప 2 సినిమాలో సూసేకి అగ్గిరవ్వ)
❄️ బెస్ట్ కామెడియన్: సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2)
❄️ బెస్ట్ బాలనటులు: మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌ (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్‌)
❄️ బెస్ట్ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)
❄️ బెస్ట్ స్క్రీన్‌ ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్‌)
❄️ బెస్ట్ గేయ రచయిత: చంద్రబోస్‌ (రాజూ యాదవ్‌)
❄️ బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్‌ రెడ్డి (గామి)
❄️ బెస్ట్ ఎడిటర్‌: నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)
❄️ బెస్ట్ ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ మేనన్‌ (గామి)
❄️ బెస్ట్ కొరియోగ్రాఫర్‌: గణేశ్ ఆచార్య (దేవర)
❄️ బెస్ట్ ఆర్ట్‌ డైరెక్టర్‌: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)
❄️ బెస్ట్ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌: కె. చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)
❄️ బెస్ట్ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు..
❄️ యాక్టర్ దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాష్కర్‌)
❄️ నటి అనన్య నాగళ్ల (పొట్టేల్‌)
❄️ దర్శకులు సూజిత్‌, సందీప్‌ (క)
❄️ నిర్మాతలు ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి (రాజూ యాదవ్‌)
❄️ జ్యూరీ స్పెషల్‌ మెన్షన్‌: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
❄️ బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా: మన సినిమా ఫస్ట్ రీల్ (రచయిత: రెంటల జయదేవ)

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..