Rajendra Prasad
ఎంటర్‌టైన్మెంట్

Rajendra Prasad: ఇప్పుడున్నంత డిస్టర్బెన్స్ అప్పట్లో లేదు.. పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యింది అందుకే!

Rajendra Prasad: నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేశ్ నిర్మించారు. ఈ సినిమాలో సీనియర్ నటి అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలను పోషించగా.. మే 30న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

‘‘ముందుగా ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 48 ఏళ్లుగా నన్ను ఎంతగానో ఆదరిస్తూ వస్తున్నారు. నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మంచి పాత్రలే వస్తున్నాయి. ఇప్పుడు నా వయసుకు తగ్గ పాత్రలే వస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని ఈ రోజు నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నాను. నేను ఎంతో సంతృప్తిగా ఫీలై చేసిన చిత్రమిది. మా హీరో, నిర్మాత రూపేశ్, ఆర్‌బీ చౌదరికి కజిన్. అమరావతిలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి ఫంక్షన్ చేయాలని అనుకున్నాం. కానీ అక్కడ అన్ని సౌకర్యాలు ఇంకా లేవు. అందుకే విజయవాడలో ట్రైలర్‌ లాంచ్ వేడుకను నిర్వహించాం. ట్రైలర్ చూస్తే ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ అని అందరికీ అర్థమయ్యే ఉండాలి. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా, తెలుగు వారిని ప్రతిబింబించేలా ఈ మూవీ ఉంటుంది.

Also Read- Sr NTR Birth Anniversary: ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు, తారక్ ఘన నివాళులు.. వీడియోలు వైరల్

నేను కూడా ఒకప్పుడు చిత్రాలు నిర్మించాను. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పట్లో లేదు. అలాగే ఇప్పుడున్నంత డిస్టర్బెన్స్ కూడా అప్పట్లో లేదు. నేను ఇప్పటికీ షాట్ చేసిన తర్వాత మానిటర్ చూడను. నాకు ఆ అలవాటు కూడా లేదు. మానిటర్ చూసుకుని వన్స్‌మోర్ అని చెప్పాల్సింది ఎవరయ్యా అంటే దర్శకుడు. మన పని మనం చేయాలి. అభివృద్దిని మనం మంచి కోసం వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం మన తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ స్థాయికి వెళ్లింది.

కళ అనేది సముద్రం వంటిది. మనం సముద్రం మొత్తాన్ని తాగగలమా? ఈదగలమా? కళ కూడా అంతేనని నేను అంటాను. ఎప్పటికీ ఆకలి, దాహం తీరదు. ఇంకా నటుడిగా ఇంకెన్నో పాత్రలు పోషించాలి. ‘షష్టిపూర్తి’ చిత్రంలో నా పాత్రకు మూడు రకాల వేరియేషన్స్ ఉంటాయి. ‘లేడీస్ టైలర్’ మూవీ మాడ్యులేషన్, గెటప్ కావాలని దర్శకుడు పట్టుబట్టి మరీ కూర్చున్నారు. కానీ నా యాటిట్యూడ్ వల్ల ఆ పాత్రను ఈజీగా పోషించాను. ఇందులో మూడు ఏజ్‌ గ్యాప్‌లను చూపించాం. ఇది నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇళయరాజా మాతో పోటీ పడి మరీ సంగీతాన్ని అందించారు. కీరవాణి మా కోసం పాట రాశారు. కీరవాణి పాట రాస్తున్నారా? అని రాజా కూడా షాక్ అయ్యారు. మా ‘షష్టిపూర్తి’ కోసం రాజా అద్భుతమైన పాటల్ని అందించారు. చైతన్య ప్రసాద్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు.

Also Read- Nandini Roy: ఆ మూవీలో నాది పెద్ద పాత్ర .. ఎడిటింగ్ లో కట్ చేశారు.. 2 మినిట్స్ కూడా లేను

నేను ఇంగ్లీష్ భాషలో ‘క్విక్ గన్ మురుగన్’ అనే చిత్రంలో నటించిన విషయం అందరికీ తెలుసు. ఎమిరైట్స్ ఫ్లైట్స్‌లో ఆ సినిమా ఉంటుంది. ఇప్పటికే అందులోంచి మూడు పార్టులు రావాల్సి ఉంది. రెండో పార్ట్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఏఐ టెక్నాలజీతో అందులో కొన్ని సీన్లను తీయబోతోన్నారు. మూడు సీన్ల కోసం నన్ను ‘సింగిల్’ మూవీకి అడిగారు. నేను చేస్తే ఆ పాత్రకు ప్రాధాన్యం వస్తుందంటే తప్పకుండా చేస్తాను. ‘సింగిల్’ మూవీలో నా పాత్ర చూసి అల్లు అరవింద్ ఫోన్ చేసి అభినందించారు. పాత్రతో పాటు పాత్రను ఎవరు పోషించారు? అన్నది కూడా ముఖ్యమని అరవింద్ అన్నారు. మనం ఏ పాత్రలు పోషించినా.. మనం కాకుండా మనం పోషించిన ఆ పాత్రలే జనాలకు గుర్తుండాలనేది నా సూత్రం. ఇది నా ఐదో జనరేషన్. ఇప్పటికీ నా కోసం ‘షష్టిపూర్తి’ వంటి పాత్రలు రాస్తున్నారంటే నిజంగా అది నా అదృష్టం. పిల్లలు తల్లిదండ్రుల పెళ్లిని చూడలేరు. కానీ 60వ పెళ్లిని మాత్రం చూడగలరు. అందుకే ఈ సినిమాకు అంత ప్రాధాన్యం. ఇలాంటి చిత్రాల్ని, పాత్రల్ని అస్సలు మిస్ అవ్వకూడదు.

కొన్ని రోజులుగా థియేటర్లు మూసి వేస్తున్నట్లుగా వార్తలు వింటున్నాను. థియేటర్లు మూసేయడం అనేది ఒక్కరి నిర్ణయంతో అయ్యే పని కాదు. అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. కానీ తప్పుడు విధానంలో వార్త బయటకు వచ్చింది. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు